తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచి మేడారం జాతరకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు మేడారం జాతర అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అసియాలోనే అతిపెద్ద జాతరగా మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే ఈ జాతరకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకునేందుకు వస్తుంటారు. ఈ నేపథ్యంలో టీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది.
మేడారం జాతర కొరకు ప్రత్యేకంగా 3,845 బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఈ మేడారం జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు కూడా తీసుకుంటోంది. కరోనా నేపథ్యంలో శానిటేషన్ వంటి ఏర్పాట్లపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. అయితే 3,845 బస్సులు మోహరించినందున మేడారంలో 50 ఎకరాల్లో భారీ బస్టాండ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.