మేడారంలో భక్తుల సందడి నెలకొంది. ముందస్తు మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులు కోరుతున్నారు. దేవాదాయ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చినవారికి వసతి సదుపాయం కల్పించారు. కరోనా వల్ల భక్తులు ముందుగానే వస్తున్నారు. జాతర రాకముందే బెల్లం బంగారంగా అమ్మవార్లకు సమర్పిస్తున్నారు. దర్శనం బాగా అయిందని భక్తులు చెబుతున్నారు.