అహ్మదాబాద్ విమాన ప్రమాద దృశ్యాలు ఇంకా కళ్ల ముందే మెదులుతున్నాయి. జూన్ 12న అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరిన ఎయిరిండియా విమానం.. టేకాఫ్ అయిన కొన్ని సెకన్లలోనే కుప్పకూలిపోయింది.
ఎంబీబీఎస్ విద్యార్థుల కోసం జాతీయ మెడికల్ కమిషన్ కొత్త బోధన ప్రణాళికకు సంబంధించిన మార్గ దర్శకాలను ఈ ఏడాది ఆగస్టు 1న జారీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ పేర్కొన్నారు.
CM KCR: దేశంలోనే వైద్యరంగంలో తెలంగాణలో శుక్రవారం సరికొత్త రికార్డు నమోదైంది. ఒకే రోజు తొమ్మిది ప్రభుత్వ వైద్య కళాశాలల్లో తరగతులు ప్రారంభమయ్యాయి. కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగాం జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైద్య కళాశాలలను సీఎం కేసీఆర్ సాక్షాత్తు ప్రారంభించారు.
మధ్యప్రదేశ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ భూతం పడగవిప్పింది. ఎంబీబీఎస్ సీనియర్ విద్యార్థుల బృందం జూనియర్లను అసభ్యకరంగా దుర్భాషలాడుతూ ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. ర్యాగింగ్‌కు పాల్పడిన సీనియర్ విద్యార్థుల వివరాలు వెల్లడి కాలేదు.
వైద్య వృత్తి కష్టమైనా డిప్రెషన్ కి గురికావద్దని వైద్యవిద్యార్ధులకు సూచించారు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. బీబీనగర్ ఎయిమ్స్ లో 2021 – 2022 ఎంబీబీఎస్ బ్యాచ్ విద్యార్థులకు వైట్ కోట్ సెరిమోనీ కార్యక్రమానికి హాజరైన గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ వైద్యవిద్యార్ధులకు హితోపదేశం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో కోలుకోవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నా అన్నారు గవర్నర్. ఆయుష్‌మాన్ భారత్, జన ఔషధి పథకాలను సద్వినియోగం పరుచుకోవాలన్నారు. బీబీ నగర్ ఎయిమ్స్ తెలంగాణ గౌరవ చిహ్నం అన్నారు.…