ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో గురువారం నాడు ఎన్‌ఐఏ విస్తృతంగా సోదాలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 14 ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, రాచకొండ, మెదక్, ప్రకాశం, విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు ప్రాంతాల్లో గురువారం ఉదయం నుంచి వారు సోదాలు జరిపారు. 2019 జూన్‌లో ఛత్తీస్ గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్ కేస్ దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు నిర్వహించారు. అప్పటి కూంబింగ్ ఆపరేషన్‌లో ఆరుగురు మావోయిస్టులతో పాటు ఓ పౌరుడు హతమయ్యారు. 2019 జూన్‌లో జరిగిన…
మహారాష్ట్రలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. పోలీసులు జరిపిన ఎనకౌంటర్‌లో 26 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు జవాన్‌లు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. మావోయిస్టులు చనిపోయిన విషయాన్ని గడ్చిరోలి ఎస్పీ అంకిత్ గోయల్ ధృవీకరించారు. కాగా గడ్చిరోలి జిల్లా ధనిరా తాలూకా గ్యారబట్టి అటవీ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. కొత్గుల్-గ్యారబట్టి ప్రాంతంలో మావోయిస్టుల కదలికలపై పోలీసులకు సమాచారం అందడంతో ఆ ప్రాంతంలో కూంబింగ్‌కు వెళ్లినట్లు సమాచారం.…
మహారాష్ట్రలో ఎన్ కౌంటర్ జరిగింది. గడ్చిరోలి గ్యార పట్టి అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎన్ కౌంటర్ జరిగిందని సమాచారం. ఈ ఘటనలో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందగా మరికొందరికి గాయాలయ్యాయి.
హైదరాబాద్ మూసారాంబాగ్ లోని ఓ ప్రింటింగ్ ప్రెస్ లో పోలీసుల సోదాలు నిర్వహించడం కలకలం రేపింది. ఈ ప్రింటింగ్ ప్రెస్‌లో నిషేధిత మావోయిస్టు సాహిత్యం ప్రింట్ చేస్తున్నారన్న సమాచారం లభించింది. దీంతో సోదాలు నిర్వహించారు. మావోయిస్ట్ నేత,ఇటీవల మరణించిన ఆర్కే జీవిత చరిత్రను ప్రింట్ చేస్తున్నట్టు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన డీసీపీ రమేష్ రెడ్డి సోదాలు నిర్వహించారు. నవ్య ప్రింటింగ్ ప్రెస్‌లో ఈ సోదాలు జరిగాయి. పీవోడబ్ల్యూ సంధ్య కు చెందిన నవ్య ప్రింటింగ్…
గత కొన్ని రోజులుగా ఏవోబీ బార్డర్ జరుతున్న ఘటనల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. అంతే కాకుండా హిద్మా కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. దీంతో ఏజెన్సీ ప్రాంతంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు భయం భయంగా గడుపు తున్నారు. ఓవైపు పోలీసులు మరో వైపు మావోయిస్టులతో గిరిజన ప్రజలకు దినదిన గండంగా మారుతుంది. తాజాగా పట్ట పగలే మావో యిస్టుల వాల్ పోస్టర్లు కలకలం రేపాయి ఈ ఘటన ములుగు జిల్లాలో చోటు చేసుకుంది. భీమదేవరకొండ…
తెలంగాణలో నేడు మావోయిస్టులు బంద్‌కు పిలుపు ఇవ్వడంతో ఏజెన్సీలో అలజడి మొదలైంది. ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌కి నెత్తిటి బాకీ తీర్చుకుంటాం అన్న హెచ్చరికలు మన్యంలో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. మరోవైపు పోలీసులు నక్సల్ ప్రభావిత ప్రాంతాల్ని జల్లెడ పడుతున్నారు. రెండ్రోజుల క్రితం జరిగిన ఎన్‌కౌంటర్‌కు నిరసనగా తెలంగాణ మావోయిస్టు పార్టీ ఇవాళ బంద్‌కు పిలుపునిస్తూ లేఖ విడుదల చేసింది. ప్రభుత్వం విప్లవకారుల్ని హత్యలు చేస్తోందంటూ తీవ్ర స్థాయిలో మండిపడింది. అయితే ప్రతీకార చర్యతో రగిలిపోతున్న మావోయిస్టులు ఏక్షణం ఎలాంటి…
ములుగు జిల్లా టేకుల గూడ అడవి ప్రాంతంలో జరిగింది బూటకపు ఎన్‌కౌంటర్ అని సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ కమిటీ అధికార ప్రతినిధి జగన్ లేఖ ద్వారా పేర్కొన్నారు. తెలంగాణ పోలీసులకు ఒక ద్రోహి సమాచారం ఇవ్వడం వలన ఈ ఎన్‌కౌంటర్ జరిగిందని లేఖలో వివరించారు. పోలీసులు ఏకపక్షంగా కాల్పులు జరిపారని జగన్ లేఖలో వివరించారు. తెలంగాణ ప్రభుత్వం సామాన్య ప్రజలను చంపడమే కాకుండా తన పాలన గొప్పగా ఉందని తెలపడం కోసం ప్లీనరీని నిర్వహించి, తమ…
ఛత్తీస్‌ఘఢ్-.బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. బీజాపూర్ జిల్లాలో ఈ ఎదురు కాల్పులు జరగగా ముగ్గురు మావోయిస్టుల మృతిచెందారు. ఘటనా స్థలం నుంచి ఎస్‌ఎల్‌ఆర్, ఎకె47 రైఫిల్‌లు స్వాధీనం చేసుకున్నారు. బీజాపూర్‌లోని తర్లగూడ తెలంగాణ సరిహద్దు లో ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం అందాల్సి వుంది.