Home
Mavoists
Mavoists News
-
Mavoists Violence: గూడ్స్ రైలుకి నిప్పు..ఆగిన రైళ్ళు
మావోయిస్టులు తమ ప్రతాపం చూపుతున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో విధ్వంసాలకు పాల్పడుతున్నారు. గతంలో జేసీబీలు, రోడ్ల నిర్మాణం చేపట్టే యంత్రాలకు నిప్పు పెట్టిన మావోయిస్టులు తాజాగా గూడ్స్ రైలుని టార్గెట్ చేశారు. ఛత్తీస్‌గఢ్ ఏజెన్సీలో మావోయిస్టులు అర్ధరాత్రి విధ్వంసం సృష్టించారు. రాష్ట్రంలోని దంతేవాడ జిల్లా బచేలి-భాన్సీ మార్గం మధ్యలో విశాఖపట్నం వైపు ఇనుప ఖనిజంతో వెళ్తున్న గూడ్స్ రైలును మావోయిస్టులు అడ్డగించారు. సుమారు 20 మంది సాయుధ నక్సలైట్లు రంగంలోకి దిగి గూడ్స్ రైలును నిలిపివేశారని, ఇంజిన్‌కు… -
ఏవోబీలో భారీ డంప్ సీజ్.. తప్పిన ప్రమాదం
ఏవోబీ సరిహద్దుల్లో భారీ ప్రమాదం తప్పింది. కూంబింగ్ కోసం వెళ్లిన పోలీసులకు భారీ డంప్ కనిపించింది. ఈ డంప్ లో ఏడు ఐఈడీ బాంబ్ లను పేల్చివేశాయి పోలీస్ బలగాలు. ఈ ఘటనలో ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోలేదని ప్రకటించారు పోలీసులు.ఈ డంప్ కి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి వుంది. -
వంతెనను పేల్చేసిన మావోలు
జార్ఖండ్‌లో మావోయిస్టులు వరుసగా దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. అధికారుల వివరాల ప్రకారం.. గిరిడి జిల్లా డుమ్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ వంతెనను మావోయిస్టులు తెల్లవారు జామున పేల్చేశారు. అంతేకాకుండా, జిల్లాలోని ఒక మొబైల్ ఫోన్ టవర్‌ను పేల్చేశారు. మరో టవర్‌కు నిప్పుపెట్టి కలకలం రేపారు. మావోయిస్టుల నేత ప్రశాంత్ బోస్ అరెస్టుకు నిరసనగా మావోలు ప్రస్తుతం రెసిస్టెన్స్ వీక్‌ను పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విధ్వంసాలకు తెగబడుతున్నారు. మావోయిస్టుల చర్యల నేపథ్యంలో వారి కోసం ఆపరేషన్‌ను మరింత ముమ్మరం… -
గడ్చిరోలిలో మావోయిస్టుల బీభత్సం
ఛత్తీస్ గడ్లో మావోయిస్టులు రెచ్చిపోయారు. గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులు బీభత్సం కలిగించారు. బాంరగడ్ తాలుకాలో రోడ్డు నిర్మాణ పనులకు ఉపయోగిస్తున్న రెండు జేసిబీ,9 ట్రాక్టర్లకు నిప్పు పెట్టారు. దీనివల్ల రూ. కోటి వరకు నష్టం జరిగినట్టు తెలుస్తోంది. దుర్గరాజ్ పీయస్ పరిధిలో 100 మంది మావోయిస్టులు ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో గడ్చిరోలి ప్రాంతంలో ఆందోళన వ్యక్తం అవుతోంది. గత కొంతకాలంగా మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. -
ఎన్‌కౌంటర్‌లో గాయపడ్డ జవాన్‌ను హైదరాబాద్‌కు తరలింపు
ములుగు కర్రిగుట్ట ఎన్‌కౌంటర్‌లో గాయపడ్డ జవాన్‌ను హైదరాబాద్‌కు తరలించారు. ప్రత్యేక ఆర్మీ హెలికాప్టర్‌లో బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న జవాన్ మధు. అక్కడి నుంచి ప్రత్యేక అంబులెన్స్‌లో సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్న వైద్యులు. గ్రేహౌండ్స్ జవాన్ మధును కలిసేందుకు భారీ స్థాయిలో యశోద ఆస్పత్రికి చేరుకుంటున్న పోలీసు అధికారులు.ఇంటలిజెన్స్, గ్రేహౌండ్స్, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు ఆస్పత్రికి చేరుకున్నారు. వీరితో పాటు ఐజీ ప్రభాకర్ రావు, ఇంటెలిజెన్స్ ఛీఫ్ అనిల్ కుమార్ జవాన్‌ణ మధు ఆరోగ్య… -
భద్రాద్రి ఎస్పీ సునీల్ దత్ తప్పుడు ప్రచారం మానుకోవాలి: జగన్
మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ విడుదల చేయడం ఏజెన్సీ ఏరియాల్లో కలకలం రేపుతుంది. ఇప్పటికే ఏజెన్సీ ప్రాంత ప్రజలు బిక్కు బిక్కు మంటూ కాలం వెళ్లదీస్తున్నారు. దీంతో ఇప్పుడు ఈ లేఖ విడుదల చేయడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. జగన్ విడుదల చేసిన లేఖ ఇప్పుడు ఇటు పోలీసులకు మింగుడు పడటం లేదు. తెలంగాణ మావోయిస్టు పార్టీని నిర్ములించాలనే లక్ష్యంతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం, పోలీసులు దాడులు చేస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు.… -
మాజీ సర్పంచ్ రమేష్ డెడ్ బాడీ అప్పగింతపై సందిగ్ధత
మావోయిస్టుల చేతిలో హతం అయిన మాజీ సర్పంచ్ రమేష్ డెడ్ బాడీ అప్పగింతపై సందిగ్దత ఏర్పడింది. ఛత్తీస్ ఘడ్-తెలంగాణ సరిహద్దులో మావోయిస్టుల చేతిలో హతం అయిన రమేష్ మృతదేహం ఇంకా అక్కడే వుంది. మృతదేహం తరలింపులో వివాదం రేగింది. అది మా పరిధి కాదంటే మా పరిధి కాదంటూ రెండు రాష్ట్రాల పోలీసు దాటవేయడం వివాదాస్పదం అవుతోంది. Read Also :బ్రేకింగ్ : కిడ్నాప్ చేసిన మాజీ సర్పంచ్‌ను హత్య చేసిన మావోయిస్టులు మావోయిస్టులు పడేసిన చోటనే… -
బ్రేకింగ్…ములుగు జిల్లాలో మాజీ సర్పంచ్ కిడ్నాప్
తెలంగాణ జిల్లాలు, సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టులు తమ ప్రాబల్యాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ములుగు జిల్లాలో ఓ మాజీ సర్పంచ్ ని కిడ్నాప్ చేశారు మావోయిస్టులు. దీంతో కలకలం రేగింది. వెంకటాపురం మండలం సూరవీడు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కురుసం రమేష్ ని మావోయిస్టులు అపహరించుకుపోయారు. నిన్న సాయంత్రం చర్లకు వెళ్తుండగా రమేష్ ని కిడ్నాప్ చేశారు మావోయిస్టులు. ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారంతో తీవ్ర ఆందోళన చెందుతూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు కుటుంబ సభ్యులు.… -
మావోయిస్టుల అలజడి.. మందుపాతర పేలి ఆర్‌ఎస్‌ఐకి గాయాలు
తెలంగాణలో మావోయిస్టులు అస్థిత్వం కోసం పోరాడుతున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో మావోయిస్టులు కలకలం సృష్టించారు. చర్ల మండలంలోని బత్తినపల్లి, ఎర్రంపాడు ప్రాంతాల మధ్య మందు పాతరను పేల్చారు. ఘటనలో గ్రేహౌండ్స్ఆర్ఎస్ఐ గాయపడ్డారు. పోస్టర్లు, వాహనాల విధ్వంసంతో మావోయిస్టులు పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ఒకవైపు మావోయిస్టులు తమ ప్రాబల్యం పెంచుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తుంటే.. రాష్ట్ర పోలీసులు కూంబింగ్‌లతో వారికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు. ములుగు, భద్రాద్రి జిల్లాల్లో సీఆర్పీఎఫ్ బలగాలతో కూంబింగ్ కొనసాగుతూనే వుంది.… -
బ్రేకింగ్: రెండు వాహనాలకు నిప్పు.. పోలీసులకు మావోయిస్టుల సవాల్
ములుగు జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. ఏటూరునాగారం మండలం రొయ్యూరు దగ్గర తారు రోడ్డు వేస్తున్న రెండు వాహనాలకు నిప్పు పెట్టిన మావోయిస్టులు పోలీసులకు సవాల్ విసిరారు. ఘటనా స్థలంలో PLGA వారోత్సవాలు విజయవంతం చేయాలని కరపత్రం వదిలి వెళ్ళారు మావోయిస్టులు. మావోయిస్టుల PLGA వారోత్సవాల సందర్భంగా పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏటూరునాగారం పీఎస్ కు 15 కిమీ దూరంలో వాహనాలు ధ్వంసం చేసి పోలీసులకు సవాల్ విసిరారు మావోయిస్టులు. ఇటీవల భారీ ఎన్ కౌంటర్‌కు…
తాజావార్తలు
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Ramayan Leak: రణబీర్ కపూర్ ‘రామాయణం’ లీక్? ఆ 11 సెకన్ల క్లిప్ చూసి తలబాదుకుంటున్న ఫ్యాన్స్!
-
Adani Ports: రూ.13,225 కోట్ల మెగా డీల్.. అదానీ షేర్ కొనేందుకు ఎగబడుతున్న ఇన్వెస్టర్లు! ఆ షేర్ ఏదో తెలుసా?
-
Iran: ఖమేనీ అంత్యక్రియలకు ప్రతిపక్ష కాంగ్రెస్‌కు ఆహ్వానం.. ఎవరు వెళ్లనున్నారంటే..!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
ట్రెండింగ్
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్‌ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్‌తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్‌ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!