స్పేస్ టెక్నాలజీ అభివృద్ధి చెందిన తరువాత విశ్వంలో ఎక్కడికైనా ప్రయాణం చేసేందుకు రాకెట్లు తయారు చేస్తున్నారు. ఇప్పటికే మనిషి చంద్రునిమీదకు వెళ్లివచ్చారు. అయితే, త్వరలోనే చంద్రునిమీద ఆవాసం ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. భూమిపై ఇబ్బందులు తెలత్తితే మనిషి మనుగడ సాగించేందుకు ఇతర గ్రహాలపైకి వలస వెళ్లేందుకు వీలుగా ప్రయోగాలు చేస్తున్నారు. మరో ఐదేళ్లలో మార్స్ మీదకు మనుషులను పంపుతామని స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ చెబుతున్నారు. Read: సోము వీర్రాజు కొత్త డిమాండ్……
మనిషి భవిష్యత్తులో భూమి మీద నుంచి చంద్రునిమీదకు, అంగారకుని మీదకు వెళ్లేందుకు అవకాశం ఉంటుందా అనే ప్రశ్నకు అవుననే సమాధానం ఇస్తున్నారు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ శాస్త్రవేత్తలు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి చంద్రుని వాతారవణంలోని పరిస్థితులు ఎలా ఉన్నాయి. అక్కడ మానవుని నివాసానికి అనుగుణంగా ఉంటుందా లేదా అనే అంశాలను దృష్టిలో పెట్టుకొని పరిశోధనలు చేశారు. చంద్రునిపైన, మార్స్ పైనా ఘనీభవించిన మంచు జాడలు ఉన్నాయని శాస్త్రవేత్తలు కనుగోన్నారు. Read: మరో రికార్డ్ సృష్టించిన…
ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ తన చేష్టలతో ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికీ అర్థం కావడం లేదు. అంగారకుడిపై మనిషిని పంపడమే లక్ష్యంగా మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ పనిచేస్తున్నది. 2002లో మస్క్ స్పేస్ ఎక్స్ సంస్థను నెలకొల్పాడు. నాసాతో కలిసి అనేక ప్రయోగాలు చేస్తున్నది ఈ సంస్థ. స్పేస్ ఎక్స్ సంస్థ 100 మెట్రిక్ టన్నులు మోసుకెళ్లే సామర్థ్యంతో కూడిన స్టార్ షిప్ ను తయారు చేస్తున్నది. రాబోయే రోజుల్లో ఈ స్టార్ షిప్…
2013 నవంబర్ 5 వ తేదీన భారత అంతరిక్ష సంస్థ ఇస్రో మంగళ్‌యాన్ ఉపగ్రహాన్ని మార్స్ మీదకు ప్రయోగించింది. మార్స్ మీదకు ప్రయోగించిన ఈ ఉపగ్రహం విజయవంతంగా 2014 సెప్టెంబర్ 24 వ తేదీన మార్స్ కక్ష్యలోకి ప్రవేశించింది. ఆరు నెలల పాటు కక్ష్యలో పరిభ్రమించేలా మామ్‌ను డిజైన్ చేశారు. అయితే, గత ఏడేళ్లుగా మామ్ పనిచేస్తూనే ఉన్నట్టు ఇస్రో శాష్ట్రవేత్తలు చెబుతున్నారు. అక్కడి నుంచి మామ్ ఉపగ్రహం ఇప్పటికీ డేటాను పంపుతూనే ఉన్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.…
భూ ప్రకంపనలు సర్వ సాధారణం.. ఎప్పుడూ ఏదో ఓ చోట అవి సంభవిస్తూనే ఉంటాయి.. ఎక్కువ సార్లు వాటి తీవ్రత చాలా తక్కువగా ఉన్నా.. కొన్నిసార్లు మాత్రం వాటి తీవ్ర ఎక్కువగా ఉంటుంది.. భారీ నష్టాన్ని కూడా చవిచూసిన సందర్భాలు ఎన్నో.. అయితే, ఈ మధ్య తరుచూ అంగాకర గ్రహంపై ప్రకంపనలు సంభవిస్తున్నాయి.. దీనిని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన ఇన్‌సైట్ ల్యాండర్ మార్స్ గ్రహం గుర్తించింది.. ఇప్పటి వరకు మార్స్‌పై సంభవించిన అతిపెద్ద,…
ఎలన్ మస్క్ గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు. వ్యాపారవేత్తగా మాత్రమే కాకుండా స్పేస్ ఎక్స్ పేరుతో అంతరిక్ష సంస్థను స్థాపించి స్పేస్ గురించిన పరిశోధనలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. నాసాతో కలిసి అనేక ప్రాజెక్టులను స్పేస్ ఎక్స్ సంస్థ చేపడుతున్నది. రాబోయే రోజుల్లో ఎలాగైనా భూమి నుంచి మనుషులను అంగారకుడిపైకి తీసుకెళ్లాలనే లక్ష్యంతో స్సేష్ షిప్ ను తయారు చేస్తున్నారు. ఈ స్పేస్ షిప్ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ రీయూజబుల్ స్పేస్‌షిప్ ద్వారా 100 మందిని అంగారకుడిమీదకు…
భూమిపై జీవరాశి ఏదైన ప్రమాదం సంభవించి నివశించడానికి అనుకూలంగా లేకపోతే… పరిస్థితి ఏంటి? మనుగడ సాగించడం ఎలా..? ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని మార్స్ గ్రహంపై నాసా పరిశోధనలు చేస్తున్నది. ఎప్పటికైనా మార్స్ మీదకు మనుషులను పంపి అక్కడ కాలనీలు ఏర్పాటు చేసి నాగరికతను విస్తరింపజేయాలని చూస్తున్నది. ఇందులో భాగంగా భూమిపై మార్స్ గ్రహంలో ఉండే విధమైన కృత్రిమ వాతావరణాన్ని నాసా సృష్టించింది. అక్కడ సంవత్సరంపాటు మనుషులను ఉంచి మార్స్ మీదకు వెళ్లినపుడు మనుషులు ఎలా ఉంటారు…
ఎలన్ మస్క్ అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్ మరో అంకానికి తెరతీసింది. అంగారక గ్రహం మీదకు ప్రయాణికులను పంపేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నది. స్టార్ షిప్ పేరుతో ఓ భారీ వ్యోమనౌకను తయారు చేస్తున్నది. ఇందులో 100 మంది వరకు ప్రయాణం చేసే అవకాశం ఉంటుందని స్పేస్ ఎక్స్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ స్టార్ షిప్‌ను రీయూజబుల్ మోడల్‌లో తయారు చేస్తున్నారు. 120 మీటర్ల పొడవున్న ఈ స్టార్ షిప్‌లో ఆరు రాప్టర్ ఇంజన్లు ఉంటాయి. ఇక…
నాసాకు మార్స్ ఆర్బిటర్‌లోని హైరైస్ కెమెరా అంగారకుడికి చెందిన చంద్రుని ఫొటోను తీసింది. ఈ ఫొటోను నాసా ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేయగా ఒక్కసారిగా వైరల్‌గా మారింది. అంగారకుడి చంద్రడు ఫోబోస్ చూడటానికి అచ్చంగా బంగాళదుంపను పోలి ఉన్నది. అంగారకుడికి రెండు చంద్రుళ్లు ఉన్నారు. అందులో అతిపెద్దది ఈ ఫోబోస్ అని నాసా పేర్కొన్నది. ఈ ఫొటోను హైరైస్ కెమెరా ఫోబోస్ ఉపరితలానికి 6,800 కిలోమీటర్ల ఎత్తు నుంచి తీసింది. ఇక ఇదిలా ఉంటే అంగారకుడికి చెందిన…