అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలు కారణంగా ప్రపంచ మార్కెట్ కుదేలైపోయింది. అమెరికా మార్కెట్‌తో పాటు అన్ని మార్కెట్లు కకావికలం అయ్యాయి. ఇక ఆసియా మార్కెట్ అయితే అల్లకల్లోలం అయింది. ఇదే అంశంపై ఆదివారం ట్రంప్‌ను విలేకర్లు ప్రశ్నంచగా చాలా తేలిగ్గా తీసుకున్నారు.