అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలు కారణంగా ప్రపంచ మార్కెట్ కుదేలైపోయింది. అమెరికా మార్కెట్‌తో పాటు అన్ని మార్కెట్లు కకావికలం అయ్యాయి. ఇక ఆసియా మార్కెట్ అయితే అల్లకల్లోలం అయింది. ఇదే అంశంపై ఆదివారం ట్రంప్‌ను విలేకర్లు ప్రశ్నంచగా చాలా తేలిగ్గా తీసుకున్నారు. ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో మాట్లాడుతూ.. కొన్ని సమస్యలకు ‘ఔషధం’ అవసరం అంటూ కొట్టిపారేశారు. ఈ సందర్భంగా వాణిజ్య యుద్ధాన్ని సమర్థించారు. సుంకాలను తగ్గించే ప్రసక్తేలేదని మరోసారి స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Stock Market: ‘బ్లాక్ మండే’.. స్టాక్ మార్కెట్ అల్లకల్లోలం
అయినా ప్రపంచ మార్కెట్లు పతనమవ్వాలని కోరుకోవడం లేదన్నారు. ఎలాంటి ఆందోళన చెందడం లేదని.. ఎందుకంటే కొన్నిసార్లు సమస్య పరిష్కారానికి మెడిసిన్ కూడా తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఈ మధ్య కాలంలో చాలామంది నేతలతో మాట్లాడానని… ఐరోపా, ఆసియా దేశాధినేతలతో చర్చించినట్లు తెలిపారు. ఇప్పుడు వాళ్లంతా ఒప్పందం కుదుర్చుకోవడం కోసం ఆరాటపడుతున్నారని చెప్పారు.
ఇక చైనా, ఈయూ దేశాలతో భారీ ఆర్థికలోటుకు సుంకాలే తగిన పరిష్కారమని స్పష్టం చేశారు.ఈ చర్యల ఫలితంగా అమెరికాలోకి బిలియన్ డాలర్ల ప్రవాహం మొదలైందని వెల్లడించారు. పాలనా కాలంలో బైడెన్ నిద్రపోవడం వల్ల వివిధ దేశాల మిగులు పెరిగిపోయిందని విమర్శించారు.
ఇది కూడా చదవండి: Mohammed Siraj: మనస్థాపానికి గురయ్యా.. జీర్ణించుకోలేకపోయా.. కష్టపడ్డాను: సిరాజ్