Encounter between police and Naxalites at Koyyur 23 years ago: నక్సలైట్స్ ఉద్యమ చరిత్రలోనే నెత్తుటి జ్ఞాపకంగా నిలిచింది కొయ్యూర్ ఎన్‌కౌంటర్. మావోయిస్టులకు భారీ దెబ్బగా భావిస్తుంటారు. భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం కొయ్యూర్ గ్రామం( ఒకప్పటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా)వద్ద 1999 డిసెంబర్ 2న పోలీసులు, పీపుల్స్ వార్ దళాల మధ్య భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో పీపుల్స్ వార్ ముగ్గురు కీలక నేతలను కోల్పోయింది. అప్పటి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి సీదిరి అప్పలరాజుకు మరోసారి వార్నింగ్ ఇచ్చారు మావోయిస్టులు.. పద్దతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ మావోయిస్టులు లేఖలో హెచ్చరించారు.. పార్టీ పంపిన లేఖపై చర్యలుంటాయనడం అప్పలరాజుకి తగదని.. మంత్రి చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించాలని ఆంధ్ర ఒడిశా బోర్డర్ (ఏవోబీ) కమిటీ వైవీఎస్ కార్యదర్శి అశోక్ పేరుతో లేఖ విడుదలైంది.. ఇక, ఈ లేఖ సోషల్ మీడియాలో ఎక్కి వైరల్‌గా మారిపోయింది.. అయితే, గతంలో ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ గణేష్ పేరిట లేఖ విడుదల…
హిడ్మా టార్గెట్ గా ఛత్తీస్ ఘడ్, తెలంగాణ పోలీసుల జాయింట్ ఆపరేషన్ కొనసాగుతోంది. హిడ్మా లోంగిపోయాడంటు పోలీసులు ఓ ప్లాన్ ప్రకారం ప్రచారం చేస్తున్నారని మావోయిస్ట్ పార్టీ అంటుంటే.. అలా చేయాల్సిన అవసరం తమకు లేదంటున్న పోలీసులు వెల్లడిస్తున్నారు. తెలంగాణ, ఛత్తీస్ ఘడ్ రెండు రాష్ట్రాల్లో హిడ్మా లోంగిపోయారంటు వస్తున్న వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఏమి జరుగుతుందేమోనని మావోయిస్ట్ పార్టీలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు ఇటీవలే మావోయిస్ట్ పార్టీ మిలిషియస్ సభ్యుడు మాడవి హిడ్మా లొంగిపోయాడు.…
ఛత్తీస్‌గఢ్‌లో మొన్నటికి మొన్న ఓ మాజీ ఉప సర్పంచ్‌ను మావోయిస్టులు హత్య చేసిన ఘటనను మరవకముందే మరో ఘాతుకానికి పాల్పడ్డారు. ఓ మానసిక వికలాంగుడు పోలీస్ ఇన్ఫార్మర్‌గా పని చేస్తున్నాడని అతడిని బీజాపూర్ జిల్లా బాసగూడలో హత్య చేశారు. అయితే గతంలోనూ మాజీ ఉప సర్పంచ్‌ను కూడా పోలీసులకు ఇన్ఫార్మర్‌గా పనిచేస్తున్నాడనే నేపంతో ప్రజా కోర్టు శిక్షించినట్లు మావోయిస్టులు తెలిపారు. ఇప్పుడు తాజాగా ఓ వికలాంగుడు పోలీసులకు మావోయిస్టుల సమాచారం అందిస్తున్నాడనే ఆరోపణతో జన మిలీషియా సభ్యులు…
తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది.. కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలోని చెన్నచెంద అటవీప్రాంతంలో తెలంగాణ గ్రేహౌండ్స్, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. చర్లకు మండలానికి 25 కిలో మీటర్ల దూరంలోని కుర్ణవల్లి, పెసలపాడు అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు చనిపోయారు.. చనిపోయిన ఆరుగురిలో… నలుగురు మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారు.. అయితే, ఈ ఎన్‌కౌంటర్‌పై భద్రాద్రి కొత్తగూడెం-తూర్పు గోదావరి డివిజన్ కమిటీ కార్యదర్శి ఆజాద్ పేరుతో లేఖ విడుదల చేసింది మావోయిస్టు…
ఏజెన్సీ ప్రాంతాల్లో తమ ప్రాబల్యాన్ని చాటుకునేందకు మావోయిస్టులు ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. అయితే గత సోమవారం సాయంత్రం ములుగు జిల్లాలోని కె.కొండాపురం మాజీ సర్పంచ్ కొర్స రమేశ్ ను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. అయితే ఈ విషయంపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు రమేశ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తాజాగా ఛతీస్‌గఢ్‌లోని కొత్తపల్లి సమీపంలో రమేశ్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. తెలంగాణ ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో రమేశ్‌ను మావోయిస్టులు…
భద్రాచలం పట్టణంలో మావోయిస్టులకు వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లుతో స్థానికంగా కలకలం రేపుతున్నాయి.. ఎక్కువగా మావోయిస్టులు మాత్రమే పోస్టర్లను అంటించి వారి ఉద్దేశాలను తెలుపుతుంటారు. అయితే తాజాగా వెలసిన పోస్టర్లు మావోయిస్టులకు వ్యతిరేకంగా ఉండటం గమనార్హం. మావోయిస్టుల విధానాలను ప్రజలు ప్రశ్నిస్తున్నట్లుగా పట్టణంలో అక్కడక్కడ పోస్టర్లు అంటించారు. అంతేకాకుండా మావోయిస్టుల పార్టీకీ సూటి ప్రశ్నలు వేసినట్లు ఈ పోస్టర్లలో సారాంశం ఉంది. నక్సలైట్లు అంటే నరహంతకులు కాదా? అభివృద్ధిని అడ్డుకోవడం నక్సలిజమా? ప్రజా విప్లవం అంటే విధ్వంసమా? తుపాకీ…
మావోయిస్టు టాప్ లీడర్ ఆర్కే.. అనారోగ్య సమస్యలతో కన్నుమూశారంటూ ఛత్తీస్‌గఢ్ పోలీసులు ప్రకటించినా.. మావోయిస్టులు అధికారిక ప్రకటన విడుదల చేయడానికి కాస్త సమయం తీసుకున్నారు.. శుక్రవారం మధ్యాహ్నం ఆర్కే మరణంపై మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికారిక ప్రకటన చేసింది. కిడ్నీల సమస్యతో ఈనెల 14న ఆర్కే మరణించారని ఆ పార్టీ నేత అభయ్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.. ఇక, ఆర్కే అంత్యక్రియలను పూర్తి చేశారు మావోయిస్టులు.. తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఆర్కే అంత్యక్రియలు నిర్వహించారు..…
మావోయిస్టు అగ్రనేత ఆర్కే మరణం అందరినీ కదలిస్తోంది.. ప్రజల సమస్యల పరిష్కారం కోసం సుదీర్ఘకాలంలో విప్లవోద్యమంలో పనిచేసిన ఆయన.. చివరకు ఆ అడవి తల్లి ఒడిలోని కన్నుమూశారు.. అయితే, ఆర్కే మరణంపై మావోయిస్టు పార్టీ మాజీ కేంద్ర కమిటీ సభ్యుడు జంపన్న తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. ఆర్కేతో నాకు 1994 నుంచి పరిచయం ఉందని ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో గుర్తుచేసుకన్న ఆయన.. వివిధ అంశాల్లో కేంద్ర కమిటీ సూచించిన డైరెక్షన్ లో ఇద్దరం కలిసి పనిచేశామన్నారు.…