మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ (ఆర్కే) ఇక లేరని చెబుతున్నారు పోలీసులు.. బీజాపూర్ అడవుల్లో ఆయన చనిపోయినట్టుగా తెలుస్తోంది.. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆర్కే.. ఇవాళ కన్నుమూశారని తెలుస్తోంది.. ఇక, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో పోలీసులు-మవోయిస్టుల మధ్య జరిగిన చర్చల్లో కీలక పాత్ర పోషించారు రామకృష్ణ.. చాలా సమయాల్లో పెద్ద పెద్ద ఎన్‌కౌంటర్ల నుంచి చివరి నిమిషంలో ఆయన తప్పించుకున్నారు. భారీ ఎన్‌కౌంటర్ జరిగిన ప్రతీ సందర్భాల్లోనూ ఆర్కే చనిపోయారా? లేదా బతికే ఉన్నారా?…
కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు.. ఎక్కడి నుంచి.. ఎప్పుడు.. ఎలా.. ఎటాక్ చేస్తుందో కూడా తెలియని పరిస్థితి… జనారణ్యంలో ఉండే వారినే కాదు.. అభయారణ్యాల్లో సంచరించే అడవుల్లోని అన్నలను కూడా వదలడంలేదు.. ఇప్పటికే పలువురు మావోయిస్టులు కరోనాతో మృతిచెందినట్టు పోలీసులు ప్రకటిస్తుండదా.. అందులో కొందరు కోవిడ్‌కు బలిఅయినట్టు.. మావోయిస్టులు ప్రకటించిన సంగతి తెలిసిందే.. తాజాగా, మావోయిస్టు కీలక నేత వినోద్.. మహమ్మారి బారినపడి మృతిచెందారు.. ఎన్‌ఐఏకి మోస్ట్‌వాంటెడ్‌గా ఉన్న వినోద్‌పై రూ.15 లక్షల రివార్డు కూడా…
మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది… ఆ పార్టీ కీలక నేత, ఉత్తర తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి హరిభూషణ్ మరణించినట్టు తెలుస్తోంది.. అనారోగ్య కారణాలతో సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆయన కన్నుమూశారని తెలుస్తోంది… కరోనా మహమ్మారి సోకడానికి తోడు.. గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల వాడకంతో.. ఆయన పరిస్థితి విషమంగా మారి మరణించారని చెబుతున్నారు.. దాదాపు డజనుకు పైగా మావోయిస్టులు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ప్రచారం సాగుతోంది.. మరోవైపు.. అనారోగ్యం బారినపడి మావోయిస్టులతో పాటు…
కరోనా బారినపడి కొంతమంది మావోయిస్టులు మృతిచెందినట్టు ప్రచారం జరుగూతేఉంది.. అయితే.. కరోనాతో మావోయిస్టుల మరణం ఒక బూటకం.. కేవలం పోలీసుల సృష్టి మాత్రమే అంటున్నారు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ… ఇక, కరోనా సెకండ్ వేవ్ ప్రబలడానికి దేశ పాలకులే కారణం అని ఆరోపించారు ఆ పార్టీ అధికార ప్రధినిధి అభయ్.. కరోనా మహమ్మారితో మావోయిస్టుల మృతి అంటూ పోలీసులు చేస్తున్న అసత్య ప్రచారాన్ని మావోయిస్టు పార్టీ నిరభ్యంతరంగా, మావోయిస్టు కేంద్ర కమిటీ ఖండిస్తుందంటూ ఓ ప్రకటన…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు మావోయిస్టు పార్టీ నేత గణేష్.. వైసీపీ రెండేళ్ల పాలనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. జగన్ ప్రజా వ్యతిరేక, నిరంకుశ విధానాలపై ఐక్య పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.. అవినీతి కేసులు ఉన్న జగన్ కేంద్రానికి తలొగ్గి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని… రెండేళ్ల జగన్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదంటూ తన లేఖలో పేర్కొన్నారు మావోయిస్టు పార్టీ ఆంధ్ర-ఒడిశా సరిహద్దు (ఏవోబీ) స్పెషల్ జోనల్…