హిడ్మా టార్గెట్ గా ఛత్తీస్ ఘడ్, తెలంగాణ పోలీసుల జాయింట్ ఆపరేషన్ కొనసాగుతోంది. హిడ్మా లోంగిపోయాడంటు పోలీసులు ఓ ప్లాన్ ప్రకారం ప్రచారం చేస్తున్నారని మావోయిస్ట్ పార్టీ అంటుంటే.. అలా చేయాల్సిన అవసరం తమకు లేదంటున్న పోలీసులు వెల్లడిస్తున్నారు. తెలంగాణ, ఛత్తీస్ ఘడ్ రెండు రాష్ట్రాల్లో హిడ్మా లోంగిపోయారంటు వస్తున్న వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఏమి జరుగుతుందేమోనని మావోయిస్ట్ పార్టీలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు ఇటీవలే మావోయిస్ట్ పార్టీ మిలిషియస్ సభ్యుడు మాడవి హిడ్మా లొంగిపోయాడు.
పోలీసులు విడుదదల చేసిన ప్రకటనలో లోంగిపోయిన మాడవి హిడ్మా వయసు 25ఏళ్లు.. స్వగ్రామం సుక్మా జిల్లా కిష్టాపురం మండలం తొండమార్క గ్రామం… అయితే ఏన్ ఐఏ దృ ష్టిలో ఉన్న మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు గెరిల్లా బెటాలియన్ కమెండర్ మాడవి హిడ్మా స్వగ్రామం సుక్మా జిల్లా పువర్తి గ్రామం వయసు 45ఏళ్లు.. రెండు పేర్లు ఒకేలాగ ఉండటంతో మాడవి హిడ్మా లోంగిపోయడని పెద్ద ఏత్తున వార్తలు వైరల్ అవుతున్నాయి. గత ఏడాది తెర్రం అటవి ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో 22మంది జవాన్లు మృతి చెందడంటంలో హిడ్మా కీలకంగా వ్యవహరించడంతో జాతీయస్థాయిలో హిడ్మా పేరు చర్చనీయాంశమవుతోంది.