త్యాగాలు చేసిన పార్టీ.. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రజల కోసం పోరాటాలు నడిపిన పార్టీ.. ప్రజా ఉద్యమాల కోసం ప్రాణాలను ప్రాణంగా పెట్టిన పార్టీ ..ఒక మాట చెప్తే కట్టుబడి ఉండే కార్యకర్తలు. అగ్ర నాయకుడు ఏం చెప్తే దానికే కట్టుబడి ఉంటారు.. తిరిగి ప్రశ్నించే దాఖలాలు కూడా ఉండవు.. క్రమశిక్షణకు మారుపేరైన మావోయిస్టు పార్టీలో ఇప్పుడు లుకలుకలు బయట పడుతున్నాయి.. మావోయిస్టు పార్టీలో అంతర్గత పోరు తారాస్థాయికి చేరింది. అంతేకాదు బహిరంగ పగడంలు ఇచ్చుకునే…
Big Shock To Maoists: ములుగు జిల్లాలో మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్టులపై ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్ చూపిస్తుంది. సుమారు ఎనిమిది మంది మావోయిస్టు సభ్యులు లొంగిపోగా, మరో 20 మంది అరెస్ట్ అయ్యారు. వారి దగ్గర నుంచి భారీగా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
చర్చల ద్వారా శాంతి నెలకొల్పాలని కోరుతూ మరో లేఖ విడుదల చేసింది మావోయిస్టు పార్టీ.. భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ పేరుతో ఈ లేఖ విడుదల చేశారు..
ఓయూలో నిర్భంద ఆంక్షలు, కాంగ్రెస్ ప్రభుత్వంపై మావోయిస్టు పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో తాజాగా లేఖ విడుదల చేయడం కలకలం రేపుతోంది. నేటి పాలకుల విధానాల వలన మునుపెన్నడూ లేని విధంగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఈ లేఖలో మావోయిస్టు పార్టీ ధ్వజమెత్తింది. ఈ ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నించే వారి గొంతును నొక్కేస్తున్నారని మండిపడింది.
బీజాపూర్‌లోని పుజారి -కంకేర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో బడే చొక్కారావుతో పాటు 17 మంది మృతి చెందారు. మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ విడుదల చేశారు. బడే చొక్కా రావు, మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా పని చేశాడు. బడే చొక్కా రావు అలియాస్ (దామోదర్, మల్లన్న) ములుగు జిల్లా, తాడ్వాయి మండలం, కాల్వపల్లి గ్రామవాసి. ఇతను మిలిటరీ చీఫ్‌గా కూడా పనిచేశాడు. చొక్కా రావు తల్లి బతుకమ్మ, తన కుమారుడు అజ్ఞాతంలో ఉన్నాడు.…
మావోయిస్ట్ పార్టీ నేడు తెలంగాణ రాష్ట్ర బంధుకు పిలుపునిచ్చింది. వరుస సంఘటనలతో ములుగు ఏజన్సీ ప్రాతంలో టెన్షషన్ వాతావరణం నెలకొంది. కేంద్ర రాష్ట్ర పోలీసు బలగాలు వాజేడు వెంకటాపురం ఏటూరునాగారం ప్రధాన రహదారులు అడుగు అడుగున తనిఖీలు చేస్తున్నాయి. తెలంగాణ ఛత్తీష్‌గఢ్ సరిహద్దులలో వరుస ఎన్కౌంటర్లతో వాజేడు వెంకటాపురం ఏజెన్సీ వాసులలో ఒక్కసారిగా భయాందోళన ఏర్పడింది. ఎప్పుడు ఎక్కడ ఏ తూటా పేలితుందో తెలియని పరిస్థితి నెలకొంది. భారత్ కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ…
ద్రోహి ఇచ్చిన సమాచారంతో డిసెంబర్ 1వ తేదీన ములుగు జిల్లా, ఏటూర్ నాగారం మండలం, చల్చాక గ్రామ పంచాయితీ అడవు పోల్ కమ్మ వాగు వద్ద తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసులు ఏడుగురి విప్లవకారులకు విషమిచ్చి అతి కిరాతకంగా చంపారని భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆరోపించింది. ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. "నవంబర్ 30వ సాయంత్రం ఏడుగురితో ఉన్న తమ దళం వలస ఆదివాసీ గ్రామాన్ని కలిసి నమ్మిన వ్యక్తికి…
Maoist Party: వికారాబాద్ జిల్లాలోని లగచర్లలో దాడి ఘటనపై మావోయిస్టులు సంచలన లేఖ విడుదల చేశారు. అందులో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న విధ్వసం, అప్రజాస్వామిక పాలన కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనో బాధ్యత రాహిత్యం వలనో జరుగుతున్నది కాదు అని తెలిపారు.
ఛత్తీస్గఢ్.. ఎన్‌కౌంటర్ పోరాటంలో 14 మంది మావోలు మృతి చెందారని.. కాల్పుల్లో గాయపడ్డ మిగతా 17 మందిని భద్రతా బలగాలు పట్టుకుని కాల్చి చంపాయని మావోయిస్ట్ పార్టీ ఆరోపించింది.