త్యాగాలు చేసిన పార్టీ.. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రజల కోసం పోరాటాలు నడిపిన పార్టీ.. ప్రజా ఉద్యమాల కోసం ప్రాణాలను ప్రాణంగా పెట్టిన పార్టీ ..ఒక మాట చెప్తే కట్టుబడి ఉండే కార్యకర్తలు. అగ్ర నాయకుడు ఏం చెప్తే దానికే కట్టుబడి ఉంటారు.. తిరిగి ప్రశ్నించే దాఖలాలు కూడా ఉండవు.. క్రమశిక్షణకు మారుపేరైన మావోయిస్టు పార్టీలో ఇప్పుడు లుకలుకలు బయట పడుతున్నాయి.. మావోయిస్టు పార్టీలో అంతర్గత పోరు తారాస్థాయికి చేరింది. అంతేకాదు బహిరంగ పగడంలు ఇచ్చుకునే స్థాయికి చేరిపోయింది.. ఏకంగా శాంతి చర్చల మీదే ప్రభావం చూపెట్టే పరిస్థితి ఏర్పడింది ..శాంతి చర్చల కోసం ఆయుధాలు వదిలి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామంటూ అభయ్ చేసిన ప్రకటన ఆ పార్టీలో విభేదాలకు తెరలేపింది.. అభయ్ అలియాస్ మల్లోజుల అధికారికంగా చేసిన ప్రకటన మావోయిస్టు కేంద్ర కమిటీ ఆగ్రహాన్ని తెప్పించింది ..పార్టీలో అంతర్గతంగా చర్చ చేయకపోయినప్పటికీ ఆయుధాలు విడిచి పెడతామంటూ అభయ్ ఎలా ప్రకటిస్తారని ఆగ్రహించింది.. అభయ్ ప్రకటన వ్యక్తిగతమని పార్టీకి సంబంధం లేదని కేంద్ర కమిటీ అధికారికంగా ప్రకటించింది ..అక్కడితో ఊరుకోకుండా మరొక ప్రకటన కూడా విడుదల చేసింది..
అభయ్ తన దగ్గర ఉన్న ఆయుధాలను వెంటనే అప్పగించాలని, లేదంటే గెరిల్లా దళం రంగంలో దిగి ఆయుధాలను స్వాధీనం చేసుకుంటుందని హెచ్చరించింది ..మావోయిస్టు పార్టీ మల్లోజులను ద్రోహిగా ప్రకటిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది.. పార్టీకి నష్టం కలిగించే విధంగా మల్లోజుల ప్రకటనలు చేస్తున్నారని, మల్లోజుల లొంగిపోయేందుకే ఇవన్నీ కుట్ర చేస్తున్నారని, మల్లోజుల తో మరొకరు మాట్లాడిస్తున్నారని మావోయిస్టు కేంద్ర కమిటీ పేర్కొంది ..పార్టీకి తీరని నష్టం చేస్తున్న మల్లోజుల ను వెంటనే బహిష్కరిస్తూ ద్రోహిగా పేర్కొంటూ మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రకటన విడుదల చేసింది. అయితే గత ఆరు నెలల కాలంలో మావోయిస్టు పార్టీలో జరుగుతున్న అంతర్గత పోరు పార్టీకి జరుగుతున్న తీరని నష్టాలు, కోల్పోతున్న క్యాడర్ తో ఒక్కసారిగా అక్కడ నిరసన గళాలు వినిపిస్తున్నాయి. అంతేకాదు మావోయిస్టు ప్రధాన కార్యదర్శి బసవరాజు ఎన్కౌంటర్ తో ఆ పార్టీ తీరని నష్టాన్ని చూసింది.. నెల రోజుల కాలంలోనే మరొకరికి ప్రధాన కార్యదర్శి పదవి కట్టబెట్టినప్పటికీ పార్టీలో అంతర్గత పోరు తీవ్ర స్థాయికి చేరింది.. కేంద్ర కమిటీని ప్రశ్నించే స్థాయికి వెళ్ళింది.. మావోయిస్టు పార్టీలో తెలుగు రాష్ట్రాల చెందిన వాళ్లు 18 మంది కేంద్ర కమిటీ సభ్యులు ఉండగా అందులో చాలా వాళ్ళని ఎన్కౌంటర్లో కోల్పోవాల్సి వచ్చింది. మావోయిస్టు పార్టీ అభయ్, జగన్ ప్రకటనల సారాంశం పైన ఇప్పుడు సర్వత్ర చర్చ నడుస్తుంది.. ఎందుకంటే మావోయిస్టు పార్టీ సంబంధించి పార్టీలో కీలక స్థానంలో పనిచేస్తున్న వాళ్లు ఎప్పుడు కూడా విరుద్ధ పర్యటనలు చేయరు.. అయితే అభయ్ అలియాస్ మల్లోజుల చర్చల ప్రతిపాదన చేస్తూనే ఆయుధాల ను వదిలిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు.. గతంలో జరిగిన శాంతి చర్చల సందర్భంగా ఆయుధాల ప్రస్తావని మీదే చర్చల ప్రతిస్తంభన కొనసాగింది.
ఇప్పటికీ మళ్ళీ చర్చల ప్రతిపాదన రాలేదు.. కానీ ఈసారి కేంద్ర కమిటీ కేంద్రంతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని ,నెల రోజుల్లో చర్చల సంబంధించి ప్రజా సంఘాలు జర్నలిస్టులు మేధావులతో అభిప్రాయాలు తెలుసుకుంటామని అభిప్రాయాలను నేరుగా జిమెయిల్ కు పంపాలని ఆపై తన లేఖలో పేర్కొన్నారు ..ఈ లేఖను మావోయిస్టు కేంద్ర కమిటీ తీవ్రస్థాయిలో తప్పు పట్టింది.. చర్చలకు కోసం ఆయుధాలను వదిలిపెట్టే ప్రసక్తి లేదని, సాయిధ పోరాట పందాలోనే ఉంటూ చర్చలను జరుపుతామని అభయ్ ప్రకటించారు. చేసిన ప్రకటన అతని వ్యక్తిగతమని తమకు ఎలాంటి సంబంధం లేదని ,అంతేకాకుండా చర్చల కోసం నెల రోజుల వ్యవధి తీసుకోవడం, అర్ధమైతమని దీనికి తోడు ఒక mail అడ్రస్ ఇవ్వడం కూడా అర్థ రహితమని అభయ అన్నాడు.. అంతేకాదు అసలు ఆయుధాలు వడిచి వదిలిపెడతామని ఇప్పటివరకు ఎలాంటి చర్చలు జరగలేదని కానీ ఆపై తన ప్రకటనలో ఆయుధాల ప్రస్తావన ఎందుకు తెచ్చాడో తెలియదని జగన్ పేర్కొన్నాడు.. పార్టీకి తీరని నష్టాన్ని చేస్తున్న జగన్ పైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
హెచ్చరికలు జారీ చేసిన రెండు రోజుల్లోనే మల్లోతులను బహిష్కరిస్తూ అధికారికంగా ప్రకటించేశారు.. అంతేకాకుండా అతను లొంగిపోతున్న తరుణంలోనే ఇవ్వాల్టి ప్రకటనలు చేస్తున్నారని, అతని దగ్గర ఉన్న ఆయుధాలు వెంటనే ఇవ్వాలని లేని ప్రక్షన్లో బలవంతంగా గెరిల్లా దళాలు వచ్చి తీసుకుంటాయని హెచ్చరించారు. అంటే పార్టీలో ఇప్పుడు విభేదాలు తారాస్థాయికి చేరాయని చెప్పవచ్చు. ఏకంగా ఒక కేంద్ర కమిటీ సభ్యుని మరొక కేంద్ర కమిటీ సభ్యుడు తీవ్ర స్థాయిలో విరుచుక పోవడం ఇప్పుడు సర్వత్రా చర్చగా కొనసాగుతుంది .అయితే మరొక వాదన కూడా వినిపిస్తుంది .ఇప్పటికే మల్లోజుల కేంద్ర ప్రభుత్వ ఆధీర్ణులకి వెళ్లిపోయారని, మహారాష్ట్రతో పాటు సిఆర్పిఎఫ్ బలగాల కంట్రోల్లో మల్లోజుల ఉన్నాడని ,ఏ క్షణంలోనైనా మల్లోజల లొంగుబాటు ప్రకటన వస్తుందంటూ పౌర సంఘాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.. పౌర సంఘాల అనుమానాన్ని బలపరిచే విధంగా అభయ్ ప్రకటనలు ఉన్నాయ్ అంటూ కేంద్ర కమిటీ కూడా చెప్పింది..