Mantralayam Hotel Rates: మంత్రాలయంలో హోటళ్ళ నిలువు దోపిడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహా పుణ్యక్షేత్రం మంత్రాలయం. కర్ణాటక, తెలంగాణ, ఏపీ నుంచి వేలాది మంది భక్తులు అక్కడికి వస్తుంటారు. ప్రత్యేక వేడుకల సందర్భాల్లో లక్షల సంఖ్యలో తరలి వస్తారు. పుణ్యక్షేత్రం వసతి గదులు తక్కువ. అదే ప్రైవేట్ లాడ్జి నిర్వాహకులకు వరంగా మారింది. 12 గంటల వసతికి ఫైవ్ స్టార్ హోటళ్లకు మించి డబ్బులు వసూలు చేస్తూ దోచుకుంటున్నారు. మంత్రాలయం పుణ్యక్షేత్రానికి ప్రతి రోజు 10 వేల నుంచి 15 వేల మంది భక్తులు వస్తారు. గురు, శని, ఆది వారాల్లో 50 వేల వరకు భక్తులు వస్తారు. రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలకు , పూర్వ పీఠాధిపతుల సమారాధనకు లక్షల్లో వస్తారు. కర్ణాటక, తెలంగాణ, ఏపీ నుంచి భక్తులు తరలి వస్తారు. రాఘవేంద్ర స్వామి మఠంకు సంబంధించి సుమారు 600 వసతి గదులు ఉన్నాయి. ప్రైవేట్ లాడ్జీలు 100 ఉండగా వాటిలో 2000 గదులు ఉన్నాయి. 3 స్టార్ హోటల్ ఒకటి, అదే స్థాయిలో మరో హోటల్ వుంది. మఠంకు సంబంధించి వసతి అందరికి లభించే అవకాశం లేకపోవడంతో ప్రైవేట్ లాడ్జీలు భక్తులను నిలువునా దోచుకుంటున్నారు.
Read Also: Puri Jagannadh: బ్రేకింగ్.. పూరిని బ్లాక్ మెయిల్ చేసిన బయ్యర్స్.. ఆడియో లీక్
Also Read
- CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
- Jana Sena - TDP: ఏలూరు మేయర్ సీటుపై జనసేన పట్టు..! అప్పలనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
- Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
- Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
మంత్రాలయంలో వసతి కొరతను అవకాశంగా తీసుకొని సాధారణ గదులకు కూడా భారీగా అద్దె వసూలు చేస్తున్నారు. రోజుకు 24 గంటలు అయితే 12 గంటలు ఒక రోజుగా పరిగణించి డబ్బులు వసూలు చేస్తున్నారు. సాధారణ రోజుల్లో ప్రైవేట్ లాడ్జీలు 24 గంటలకు వెయ్యి రూపాయల వరకు, స్టార్ హోటల్ లో 2 వేలు, 3 వేలు వసూలు చేస్తున్నారు. దసరా, సంక్రాంతి, ఉగాది పండుగలు, ఆరాధానోత్సవాలు, సెలవు దినాల్లో మామూలు హోటళ్లు 12 గంటలకు 5 వేలు, 8 వేలు, 10 వేలు వసూలు చేస్తున్నారు. మంత్రలయంలోని స్టార్ హోటల్ స్థాయిలో ఉన్న హోటల్ లో సాధారణ రోజుల్లోనూ, పండుగలు, సెలవులు, ఉత్సవాల రోజుల్లో ఒకే ధర వసూలు చేస్తుండగా మామూలు హోటళ్లలో 12 గంటలకు 5 వేలు, 8 వేలు , 10 వేలు వసూలు చేస్తున్నారు. అంటే రోజుకు ఒక గదికి 10 వేల నుంచి 20 వేలు వసూలు చేస్తున్నారు.
మంత్రాలయంలో డబ్బులు చెల్లించగలిగిన వారు 10 వేలు, 20 వేలు చెల్లించి గదులు తీసుకోగలుగుతున్నారు. మిగిలిన వారు ఏ బస్టాండులోనో, మఠం ప్రాంగణంలో రోడ్డుపై విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రైవేట్ లాడ్జీలు భక్తులను దోచుకుంటున్నా నియంత్రించాల్సిన అధికారులు నోరు మెదపడం లేదు. కొందరు నెలసరి మామూళ్లు తీసుకొని మౌనం వహిస్తే మరికొన్ని శాఖలు తమకు ఉచితంగా గదులు ఇస్తే చాలని ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా ఇటు వైపు కన్నెత్తి చూడలేదు. ప్రతి ఏటా కోట్లాది రూపాయలు భక్తుల నుంచి దోచుకుంటున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో ప్రైవేట్ లాడ్జీల దందా కు అడ్డు అదుపు లేకుండా పోయిందన్న విమర్శలు ఉన్నాయి. మంత్రాలయంలో ప్రైవేట్ లాడ్జీల దోపిడీని అరికట్టేందుకు అధికారులు చర్యలు తీసుకోవలని భక్తులు కోరుతున్నారు. ప్రతి లాడ్జీలో ధరల పట్టిక ప్రదర్శించేలా ఆదేశించాలని, నిబంధనలు పాటించేలా చూడాలని కోరుతున్నారు.
Read Also: Minister Prashanth Reddy: రాజగోపాల్ రెడ్డికి డిపాజిట్ కూడా దక్కదు..
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!