కొవిడ్ తర్వాత యువకుల్లో గుండె ఆగిపోవడం వల్ల ఆకస్మిక మరణాలు నమోదయ్యాయి. అయితే కారణాన్ని నిర్ధారించడానికి తగిన ఆధారాలు అందుబాటులో లేవని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవ్య ఈరోజు పార్లమెంటుకు తెలిపారు.
పథకాల ద్వారా రైతులకు లబ్ధి చేకూర్చేందుకు ఉద్దేశించిన మొత్తం రూ.3.70 లక్షల కోట్లకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా బుధవారం ఇక్కడ తెలిపారు.
Nursing Colleges: ప్రస్తుతం ఉన్న మెడికల్ కాలేజీలతో కలిపి రూ. 1,570 కోట్లతో 157 నర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు బుధవారం జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. దేశంలో తక్కువ ధరకు నాణ్యమైన నర్సింగ్ విద్యను అందించడంతో పాటు నర్సింగ్ నిపుణుల సంఖ్యను పెంచే లక్ష్యంతో ఈ పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు.
Mansukh Mandaviya: కరోనా ఒక వైరస్, ఇది పరివర్తన చెందుతూనే ఉంటుందని, భారతదేశంలో ఇప్పటి వరకు 214 విభిన్న రకాలను కనుగొన్నట్లు కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయా వెల్లడించారు. ఇటీవల కరోనా కేసుల్లో పెరుగుదల ఉందని, ఎదుర్కొవడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఐసీయూ, ఆక్సిజన్ సరఫరా ఇతర ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయని, వారానికోసారి సమీక్ష జరుగుతోందని ఆయన అన్నారు. కోవిడ్ ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో అంచనా వేయడం అసాధ్యం అని, ప్రస్తుతం వస్తున్న వేరియంట్లు…
Shocking : కొన్ని నెలలుగా గుండెపోటుకు సంబంధించిన షాకింగ్ ఘటనలు భారీగా వెలుగు చూస్తున్నాయి. పెళ్లి సమయంలో కళ్యాణ మండపంలో గుండెపోటుతో కొందరు, క్రికెట్ ఆడుతూ కొందరు చనిపోతున్నారు.
Postpone Bharat Jodo Yatra, Health minister writes to Rahul Gandhi: చైనా, తూర్పు ఆసియా దేశాల్లో మళ్లీ కోవిడ్ కేసులు విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా చైనాలో పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పుతున్నాయి. కోవిడ్ తో బాధపడేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఎంతలా అంటే అక్కడ అంత్యక్రియలు చేయడానికి కూడా సిబ్బంది దొరకడం లేదు. మరణాల సంఖ్య కూడా పెరిగింది. చైనా రాజధాని బీజింగ్ తో పాటు మరో కీలక నగరం షాంఘైలో కేసులు ఇబ్బదిముబ్బడిగా వచ్చిపడుతున్నాయి.
The central government has organized a key meeting on Covid-19: ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కోవిడ్-19 ప్రకంపనలు ప్రారంభం అయ్యాయి. ఇప్పటికే చైనాతో పాటు పలు దేశాల్లో పరిస్థితులు అధ్వానంగా మారాయి. ముఖ్యంగా చైనాలో కేసుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. ఇప్పటికే అక్కడ అంత్యక్రియలకు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పాడ్డాయి. దీంతో అంతర్జాతీయంగా కోవిడ్ పరిణామాలపై భారతదేశం కూడా అప్రమత్తం అయింది.