అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించే స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి సహకారం అందించాలని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలు, కార్మిక, ఉపాధి శాఖల మంత్రి మన్‌సుఖ్ మాండవీయను ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ కోరారు. ఏపీని స్పోర్ట్స్ హబ్‌గా మార్చడానికి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో జిల్లా స్థాయి ఖేలో ఇండియా సెంటర్లను ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రికి చెప్పారు. ఏపీలో ఈఎస్ఐ హాస్పిటల్స్ అభివృద్ధికి సహకరించాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు. మంత్రి నారా లోకేష్…
Vinesh Phogat: ఒలింపిక్స్‌లో ఖచ్చితంగా పతకం సాధిస్తుందని యావత్ దేశం వినేష్ ఫోగట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. కేవలం 100 గ్రాముల అధిక బరువు ఉందనే కారణంగా ఒలింపిక్స్ వినేష్ ఫోగట్‌పై అనర్హత వేటు వేయడం ఒక్కసారిగా దేశం షాక్‌కి గురైంది.
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూక్ మాండవీయ్య క్రికెట్ ఆడుతూ ఎంజాయ్ చేశారు. గుజరాత్‌లోని పోరుబందర్‌లో ఆయన స్థానికులతో కలిసి కాసేపు గ్రౌండ్ లో క్రికెట్ ఆడారు.
Covid vaccine: ఇటీవల కాలంలో పెరుగుతున్న గుండెపోటు మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్‌కి సంబంధం ఉందనే వార్తల నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా క్లారిటీ ఇచ్చారు. గుండెపోటుకు కోవిడ్ వ్యాక్సిన్‌లు కారణం కాదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) నిర్వహించిన అధ్యయనాన్ని ఉటంకిస్తూ మాండవియా శనివారం తెలిపారు. ఏఎన్ఐ డైలాగ్స్ 2024లో ఆయన మాట్లాడుతూ.. ఈ రోజు ఎవరికైనా స్ట్రోక్ వచ్చినట్లయితే, అది కోవిడ్ వ్యాక్సిన్ వల్లే అనే భావిస్తున్నారు, గుండెపోటుకు…
ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ. శుక్రవారం ఏపీలోని విజయవాడ, గుంటూరు జిల్లాలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా విజయాడ ఓల్డ్ జీజీహెచ్‌లో క్రిటికల్ కేర్ బ్లాక్, బీఎస్ఎల్-3 ల్యాబ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన అమరావతిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ.. ‘ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం. ఏపీలో…
ఇవాళ విజయవాడ, గుంటూరు జిల్లాల్లో కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పర్యటించారు. విజయవాడలోని ఓల్డ్ జీజీహెచ్ లో క్రిటికల్ కేర్ బ్లాక్, బీఎస్ఎల్-3 ల్యాబ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా రేపు (శుక్రవారం) విజయవాడ, గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈరోజు సాయంత్రం ఢిల్లీ నుండి విజయవాడ చేరుకుని.. రాత్రికి విజయవాడలో బస చేయనున్నారు. శుక్రవారం ఉదయం 9.15 కు విజయవాడలో పాత ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో క్రిటికల్ కేర్ బ్లాక్, BSL-3 ల్యాబ్ నిర్మాణానికి కేంద్రమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అక్కడ కొత్తగా నిర్మించిన IPHL ల్యాబ్స్ ను ప్రారంభించనున్నారు.
Covid Vaccination: కోవిడ్-19 వ్యాక్సినేషన్ తర్వాత యువకుల్లో అనూహ్యంగా ఆకస్మిక మరణాలు పెరగడం ప్రజల్ని ఆందోళనపరిచింది. అయితే ఇలా హఠాత్తుగా ఎలాంటి అనారోగ్యం లేని యువకులు గుండెపోటులో మరణించిన కేసులు దేశవ్యాప్తంగా నమోదయ్యాయి. అయితే కోవిడ్-19 వ్యాక్సినేషన్ వల్ల భారతదేశ యువకుల్లో మరణాలు సంభవించే ప్రమాదాన్ని పెంచలేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) నిర్వహించిన అధ్యయనంలో తేలిన వివరాలను ప్రభుత్వం శుక్రవారం పార్లమెంట్‌కి తెలియజేసింది.
భారతదేశంలో వేగంగా పెరుగుతున్న గుండెపోటు కేసులు కరోనా మహమ్మారికి సంబంధించినదా? అనే ప్రశ్న నేడు అందరి మదిలో మెదులుతోంది. అవును ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం తెలిసింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ గుండెపోటుకు అసలు కారణం, దానిని నివారించడానికి మార్గాలను చెప్పారు.
కేరళలో నిపా వైరస్ కలకలం రేపుతోంది. కోజికోడ్ జిల్లాలో నిపా వైరస్ కారణంగా ఇద్దరు మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. అదే జిల్లాలో మరో ఇద్దరికి కూడా ఈ వైరస్ సోకినట్లు కేరళ ప్రభుత్వం వెల్లడించింది.