Mansukh Mandaviya: కరోనా ఒక వైరస్, ఇది పరివర్తన చెందుతూనే ఉంటుందని, భారతదేశంలో ఇప్పటి వరకు 214 విభిన్న రకాలను కనుగొన్నట్లు కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయా వెల్లడించారు. ఇటీవల కరోనా కేసుల్లో పెరుగుదల ఉందని, ఎదుర్కొవడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఐసీయూ, ఆక్సిజన్ సరఫరా ఇతర ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయని, వారానికోసారి సమీక్ష జరుగుతోందని ఆయన అన్నారు. కోవిడ్ ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో అంచనా వేయడం అసాధ్యం అని, ప్రస్తుతం వస్తున్న వేరియంట్లు పెద్దగా ప్రమాదకరం కావని ఆయన అన్నారు.
Read Also: Banks Holidays : నేటి నుంచి ఐదు రోజులు బ్యాంకులకు సెలవులు
మరోవైపు ఇటీవల పలు రాష్ట్రాల్లో యువకులు గుండెపోటుతో మరణించారు. అయితే ఈ గుండెపోటులకు కోవిడ్ తో ఏదైనా సంబంధం ఉందా అనే విషయాలను ఆరోగ్యమంత్రిత్వ శఆఖ పరిశీలిస్తోందిన మాండవీయా ఓ నేషనల్ మీడియాతో అన్నారు. గుండె పోటు, కోవిడ్ మధ్య సంబంధాన్ని కనుగొనేందుకు ప్రభుత్వం పరిశోధనలు ప్రారంభించిందని రెండు మూడు నెలల్లో ఫలితాలు వస్తాయని ఆయన చెప్పారు. ఇటీవల పలు సందర్భాల్లో యువకులు గుండెపోటులో మరణించడం చూశామని, దేశంలోని అనేక ప్రాంతాల నుంచి నివేదికలు రావడం ప్రారంభించాయని వీటిపై దర్యాప్తు చేయాల్సి ఉందని ఆయన అన్నారు.
కోవిడ్ ఫోర్త్ వేవ్ పై అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య మంత్రి సూచించారు. ప్రస్తుతం XBB1.16 సబ్-వేరియంట్ ఇన్ఫెక్షన్‌ల పెరుగుదలకు కారణమవుతోందని అన్నారు. ప్రస్తుతం ఇండియాలో ఉన్న వ్యాక్సిన్లు అన్ని వేరియంట్లకు వ్యతిరేకంగా పనిచేశాయని ఆయన అన్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) గత మూడు నాలుగు నెలలుగా గుండె పోటు, కోవిడ్ మధ్య సంబంధంపై అధ్యయనం చేస్తోందని మరో రెండు నెలల్లో ఇది పూర్తవుతుందని ఆయన అన్నారు.