నటుడు భానుచందర్ ఈ తరం వారికి కేరెక్టర్ యాక్టర్ గా పరిచయం. కానీ, ఒకప్పుడు మార్షల్ ఆర్ట్స్ తో తనదైన బాణీ పలికిస్తూ హీరోగానూ మురిపించారు. అనేక చిత్రాలలో విలక్షణమైన పాత్రల్లోనూ అలరించారు. చూడటానికి ఇప్పటికీ నాజూగ్గా కనిపించే భానుచందర్ ఈ యేడాదితో 70 ఏళ్ళు పూర్తి చేసుకోబోతున్నారు. మద్దూరు వెంకటసత్య సుబ్రహ్మణ్యేశ్వర భానుచందర్ ప్రసాద్ గా 1952 మే 31 న భానుచందర్ జన్మించారు. ఆయన తండ్రి మాస్టర్ వేణు ఆ రోజుల్లో పేరు మోసిన…