దేవుడు మీద ఒట్టు పెట్టి చెప్తున్నా.. అర్హులకే రుణ మాఫీ చేస్తామని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు. రూ. రెండు లక్షల లోపు ఉన్న వారికే రుణాలు మాఫీ చేస్తామని స్పష్టం చేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. "ఎవరికైనా రుణ మాఫీ కాకుంటే ఆ ఫిర్యాదులు పరిష్కారం చేస్తాం.
Dr. Mallu Ravi: బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవదు,.. అన్ని సీట్లు కాంగ్రెస్ గెలుస్తుందని కాంగ్రెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మగాడివైతే మల్కాజిగిరి ఎంపీగా పోటీ చెయ్యమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటిఆర్ మాట్లాడ్డం ఆయన రాజకీయ అవివేకానికి నిదర్శనం అని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది ఉచిత వైద్య సదుపాయాలు పొందుతున్నారు.. పథకాల అమలు అర్ధం కాకపోతే ఆర్టీఐ ద్వారా వివరాలు తెలుసుకోవాలి అని సూచించారు. కిషన్ రెడ్డి కాంగ్రెస్ పై కావాలనే బురద జల్లుతున్నారు అని ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి వెల్లడించారు.
బీఆర్‌స్ తప్పులు ఒప్పుకోని కాళేశ్వరం విజిట్ మానుకోవాలన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం ఎందుకు వెళ్తున్నారో చెప్పాలన్నారు. శ్వేతపత్రంలో కాళేశ్వరంలో జరిగిన తప్పులను వాస్తవాలను ప్రజల ముందు ఉంచామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా బిఅరెస్ నేతలు తప్పులు ఒప్పుకోని ప్రభుత్వానికి సహకరించాలన్నారు. కాళేశ్వరం తప్పులకు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, కేసీఆర్, కేటీఆర్ చెప్పినట్లు చెయ్యరు, నిపుణుల కమిటీ నివేదికే ఫైనల్ అని ఆయన వ్యాఖ్యానించారు. కాళేశ్వరం విషయంలో…
కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి మల్లు రవి. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ లో నీటి సమస్యలు చాలా కీలకమన్నారు. కృష్ణ జలాల గురించి అసెంబ్లీలో చర్చ జరుగుతుంటే కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నేతగా హాజరుకాకపోవడం ప్రజలను అవమనపరిచినట్టేనని ఆయన వ్యాఖ్యానించారు. కీలకమైన బడ్జెట్ సమావేశాలలో కేసీఆర్ రాకుండా బయట ఎక్కడో మాట్లాడ్డం ఏమిటి అని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్షాలు ఎంత సేపు మాట్లాడిన అవకాశం ఇస్తామని చెప్తున్న…
పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కవితకు పులే గుర్తురాలేదా? ప్రజాభవన్ కు పూలే పేరు పెట్టాక గుర్తొచ్చిందా? అన్నారు తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఐదేళ్లు మహిళలకు కేబినెట్‌లో అవకాశం ఇవ్వనప్పుడు.. కేసీఆర్ ను కవిత ఎందుకు ప్రశ్నించలేదు? అని ఆయన అన్నారు. పూలే ఆలోచన విధానానికి వ్యతిరేకంగా కేసీఆర్ పరిపాలన చేశారని, మహిళలకు, బీసీలకు తీరని అన్యాయం చేసింది కేసీఆర్ అని ఆయన వ్యాఖ్యానించారు. నిర్మాణత్మకంగ విమర్శలు…
మణిపూర్ నుండి రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర చేపట్టారన్నారు మాజీ ఎంపీ మల్లు రవి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మొదటి దశ భారత్ జోడో యాత్ర ద్వారా భారత్ దేశాన్ని ఏక తాటిపై తీసుకొచ్చే ప్రయత్నం చేశారన్నారు. దేశంలోని ముఖ్య సమస్యలు, మణిపూర్ లో జరిగిన అల్లర్లపై సమాధానం కోరిన ప్రతిపక్షాలను సభ నుండి సస్పెండ్ చేసి బిల్లులను పాస్ చేసుకున్నారన్నారు మల్లు రవి. అంతేకాకుండా.. ప్రజా సమస్యలను అడగకుండా, ప్రశ్నించకుండా అడ్డుకుంటున్న…
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులు కీలుబొమ్మల్లా ఉండేవారని, పని చేసే స్వేచ్ఛ లేక స్వతంత్రంగా ఎలాంటి నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ లేదని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఆరోపించారు. పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకుడు మల్లు రవి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, అనేక ఎన్నికలను అమలు చేయడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రులు కేటీ…