Bhatti Vikramarka : రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పథకాల అమలు నిష్పాక్షికంగా, పారదర్శకంగా జరుగుతుందని, ప్రజలు ఏ విధంగానూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. సభలో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 26వ తేదీ నుండి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీ ప్రారంభమవుతాయని…
Khammam: ఖమ్మం జిల్లాలో నేడు (జనవరి 13) ఐదుగురు మంత్రులు పర్యటించబోతున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు పర్యటించబోతున్నారు.
ప్రతి తండాలో గ్రామ పంచాయతీ భవనం, అంగన్వాడి స్కూల్, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పాఠశాల, హాస్పిటల్ ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంది.. కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతం అదే.. 2029లో రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అవుతారు.. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు.
Deputy CM Bhatti: నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ లో ఆదివాసి ప్రజా ప్రతినిధుల సాధికారత శిక్షణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదివాసీల కోసం చట్టాలు చేసి వాటిని అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఇక, చట్టాలను అమలు చేయించుకునే బాధ్యత మనపై ఉందని పేర్కొన్నారు.
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేడు (ఆదివారం) వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలోని 15వ డివిజన్‌లో విద్యుత్ సబ్‌స్టేషన్ల నిర్మాణానికి మొగిలిచెర్లలో శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో భాగంగా.. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ ప్రజాభవన్ నుంచి రోడ్డు మార్గంలో బయల్దేరి మధ్యాహ్నం 1.45 గంటలకు హనుమకొండకు చేరుకుంటారు. అనంతరం 1.55 గంటల నుంచి 2.45 గంటల వరకు సుప్రభ హోటల్‌లో బస చేసి…
రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చేందుకు యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌లోని 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండో యూనిట్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతికి అంకితం చేశారు. థర్మల్ స్టేషన్‌లోని పైలాన్‌ను ముఖ్యమంత్రి తమ చేతుల మీదుగా ఆవిష్కరించారు.
పోలీస్ సిబ్బందికి సరెండర్ లీవ్ లకు సంబంధించిన బడ్జెట్ ను రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో విడుదల చేసింది. పోలీస్ సిబ్బందికి సరెండర్ లీవ్‌ల బడ్జెట్‌గా రూ.182.48 కోట్లను విడుదల చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Mallu Bhatti Vikramarka: నేడు ఖమ్మం సమీకృత కలెక్టర్ కార్యాలయంలో ఇందిర మహిళా శక్తి క్యాంటీన్, బస్సు షెల్టర్, కలెక్టరేట్ సిబ్బంది భోజనశాల, లేడీస్ లాంజ్, స్త్రీ టీ క్యాంటీన్ లను ప్రారంభించారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మహిళాభివృద్ధిలో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలువనుందని, ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఇచ్చి మహిళలను వ్యాపారవేత్తలు గా తీర్చిదిద్దుతామని ఆయన అన్నారు. ఈ ఏడాది…
Mallu Bhatti Vikramarka: అమెరికాలోని లాస్‌వేగాస్ జరుగుతున్న మైన్ ఎక్స్ పోలో 2 వేలకు పైగా ఆధునిక యంత్ర తయారీ సంస్థలు పాల్గొన్నాయి. 121 దేశాల నుండి 40 వేల మంది ప్రతినిధులు హరయ్యారు. మైన్ ఎక్స్ సందర్భంగా సదస్సులో తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రసంగించనున్నారు. మూడు రోజుల ప్రదర్శనకు అత్యాధునిక, భారీ మైనింగ్ ఖనిజ ఉత్పత్తి యంత్రాలు ఉండనున్నాయి. తెలంగాణలో మైనింగ్ లో ఆధునిక సాంకేతికత వినియోగం కోసం ఆయన…