కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు సోమవారం జరగనున్నాయి. పార్టీ అధ్యక్ష పదవి కోసం కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, శశథరూర్కు మధ్య గట్టి పోటీ జరగనుంది.
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో సీనియర్ నేతలు మల్లిఖార్జున్ ఖర్గే, శశిథరూర్లు పోటీపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఖర్గేకు అధిష్ఠానంతో పాటు సోనియా సపోర్టు ఉందని కొంత కాలంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా అధ్యక్ష పదవికి ఆయన పేరును స్వయంగా సోనియానే సూచించినట్లు కూడా వార్తలు వచ్చాయి.
Mallikarjun Kharge: ఏఐసీసీ అధ్యక్ష పదవి రేసులో ఉన్న మల్లిఖార్జున ఖర్గే విజయవాడలో పర్యటించి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధ్యక్షునిగా పోటీ చేసే అరుదైన అవకాశం తనకు వచ్చిందన్నారు. తాను ఇప్పటికే పార్లమెంటులో ప్రతిపక్ష నేతగా ఉన్నానని.. సుదీర్ఘ కాలం పాటు కర్ణాటక రాష్ట్రంలో రాజకీయం చేశానని తెలిపారు. 2009లో సోనియా గాంధీ సూచనల మేరకు లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేశానని.. కేంద్ర కార్మిక శాఖ, సోషల్ జస్టిస్ మంత్రిగా…
ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తయిందని కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల అథారిటీ ఛైర్మన్ మధుసూదన్ మిస్త్రీ వెల్లడించారు. ఏఐసీసీ ఎన్నికల పోటీలో మల్లికార్జున ఖర్గే, శశిథరూర్లు ఇద్దరే ఉన్నట్లు ఆయన తెలిపారు.
నేడు ఏఐసీసీ అద్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే హైదరాబాద్కు రానున్నారు. ఈనేపథ్యంలో.. ఎన్నికల ప్రచారం కోసం వస్తున్న ఆయన మధ్యాహ్నం గాంధీభవన్లో టీపీసీసీ ప్రతినిధులతో సమావేశం కానున్నారు...
Shashi Tharoor Comments on Mallikarjun kharge: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. అనేక రాజకీయ పరిణామాాల మధ్య అధ్యక్ష బరిలో మల్లికార్జున ఖర్గేతో పాటు శశిథరూర్ ఉన్నారు. ఇదిలా ఉంటే అధ్యక్ష ఎన్నిక ఏకభిప్రాయంతో కావాలని.. ఈ విషయాన్ని శశిథరూర్ కు చెప్పానని మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. మరోవైపు శశిథరూర్ కూడా తన ప్రచారాన్ని ప్రారంభించారు. మల్లికార్జున ఖర్గే అభ్యర్థిత్వంపై శశిథరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీలో మార్పలు…
Mallikarjun Kharge Comments on congress president elections: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఏకాభిప్రాయంతో అధ్యక్షుడిని ఎన్నుకుంటే మంచిదని అన్నారు మల్లికార్జున ఖర్గే. ఇదే విషయాన్ని శశిథరూర్ కు చెప్పానని ఆయన అన్నారు. ఆదివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు ఎవరూ కూడా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేయాలనుకోలేదని ఖర్గే అన్నారు. కొంతమంది సీనియర్ నాయకులు నన్ను పోటీ…
గాంధీజీ భారతదేశంలో పుట్టడం మనందరి అదృష్టమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఆయన మార్గం ప్రపంచ మానవాళికి దిశానిర్దేశమన్నారు. ప్రస్తుతం దేశంలో అనేక రకాల అశాంతి, విభజన చోటు చేసుకుంటుందన్నారు.
Congress President Elections: దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు చర్చనీయాంశంగా మారాయి. అనేక మలుపులు తిరుగుతున్న ఈ ఎన్నికలు ప్రస్తుతం ఓ కొలిక్కివచ్చాయి. కాంగ్రెస్ అధ్యక్షఎన్నికల కోసం మల్లికార్జున ఖర్గేతో పాటు శశిథరూర్, జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి కేఎన్ త్రిపాఠి నామినేషన్లు దాఖలు చేశారు. తాజాగా త్రిపాఠి నామినేషన్ తిరస్కరణకు గురైంది. దీంతో పోటీలో ఇద్దరే మిగిలారు. వీరిద్దరి మధ్యే పోటీ నెలకొననుంది.