Teenmaar Mallanna: తెలంగాణలో ఎన్నికల సందడి కొనసాగుతోంది. ఇంకా నెల కూడా గడవలేదు. వచ్చే నెలలోగా తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది. అధికార బీఆర్ఎస్ పార్టీనా? లేక వేరే పార్టీనా? దీంతో పాటు ఈసారి ఎలాగైనా గెలవాలని ప్రధాన పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.
INDIA bloc: 2024 లోకసభ ఎన్నికల్లో ప్రధాని మోడీని, బీజేపీని అడ్డుకునేందుకు దేశంలోని ప్రతిపక్షాలన్నీ కలిసి ఇండియా కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. అయితే దీనికి సంబంధించి కూటమిలోని పార్టీలన్నీ మూడు సమావేశాలను నిర్వహించాయి. ఇదిలా ఉంటే కొంతకాలంగా ఇండియా కూటమిలోని పలువురు మిత్రపక్షాల నేతలు ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే మధ్యప్రదేశ్ ఎన్నికల్లో తమకు సీట్లు కేటాయించలేదని సమాజ్ వాదీ పార్టీ(చీఫ్) అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ తీరుపై ఆగ్రహంగా ఉన్నారు.
మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని బీజేపీ ప్రైవేట్ పరం చేయాలని చూస్తోందని కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆరోపించారు. అందుకు బీఆర్ఎస్ సహకరిస్తుందన్న ఆయన.. బీజేపీ, బీఆర్ఎస్లు ఒక్కటేనన్నారు. బీజేపీకి బీఆర్ఎస్ ఏ టీం, బీఆర్ఎస్కు బీజేపీ బీ టీం అంటూ ఆయన విమర్శించారు. కాంగ్రెస్ విజయభేరి యాత్రలో భాగంగా మెదక్లో నిర్వహించిన జనసభలో ఆయన ప్రసంగించారు.
నేడు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. సంగారెడ్డి, మెదక్ నియోజకవర్గాల్లో కార్నర్ మీటింగ్ లో ఖర్గే పాల్గొననున్నారు. సంగారెడ్డి గంజి మైదాన్ లో మధ్యాహ్నం 12 గంటలకు 30 breaking news, latest news, telugu news, mallikarjun kharge, congress, telangana elections 2023
వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో అధికార వ్యతిరేకత ఉందని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కుల గణనపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారని, ఇది చారిత్రాత్మక నిర్ణయం అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం అన్నారు. విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) ఉదయం నాలుగు గంటలపాటు సమావేశమై కుల గణనపై చర్చించిందని అన్నారు.
INDIA Bloc: ఎన్సీపీ అధినేత శరద్ పవార్ శుక్రవారం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కీలక నేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతిపక్ష ఇండియా కూటమి కార్యాచరణపై నేతలు చర్చించారు. సెప్టెంబర్ 1న ముంబైలో చివరిసారిగా సమావేశమైన ఇండియా కూటమి, తదుపరి కార్యాచరణపై చర్చిస్తున్నట్లు తెలిసింది.
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ శుక్రవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు రాహుల్ గాంధీని కలిశారు. ఆగస్టు 31, సెప్టెంబర్ 1న ముంబైలో చివరిసారిగా సమావేశం కాగా.. ప్రతిపక్ష ఇండియా కూటమి కోసం ముందుకు సాగే ప్రణాళికపై చర్చించినట్లు తెలిసింది.
Posters in Hyderabad: నేటి నుంచి రెండు రోజుల పాటు హైదరాబాద్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశంలో ఐదు రాష్ట్రాల పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల ఎజెండాతో పాటు 18 నుంచి జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన విధివిధానాలు, విధివిధానాలపై కాంగ్రెస్ అగ్రనేతలు చర్చించనున్నారు.