తెలంగాణాలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా, రాష్ట్రంలో ఫేమస్ పర్సనాలిటీ ఎవరు చేశారు అంటే ప్రతి ఒక్కరి నుంచి వినిపించే పేరు ‘మల్లారెడ్డి’. “పాలమ్మినా, పూలమ్మినా, కష్టపడినా” అంటూ డైలాగు చెప్పి మరీ మల్లారెడ్డి పేరుని చెప్తారు తెలంగాణా యూత్. అంతలా ఫేమస్ అయిన తెలంగాణా మినిస్టర్ మల్లారెడ్డి, ‘మేమ్ ఫేమస్’ అనే సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ కి ఛీఫ్ గెస్టుగా హాజరయ్యాడు. ఈ ఈవెంట్ లో తన స్టైల్ లో మాట్లాడిన మల్లారెడ్డి…
మంత్రి మల్లారెడ్డి, బంధువుల ఇళ్లలో ఐటీ సోదాలు నిన్న అర్థరాత్రితో ముగిసాయి. అయితే ఐటీ హై డ్రామాతో తన బంధువుల ఇంట్లో సోదాలు ముగియడంతో మంత్రి మల్లారెడ్డి పైర్ అయ్యారు. దొరికింది గోరంత అయితే ఐటీ డప్పు మాత్రం కొండంత అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలో కోట్ల రూపాయల పేరుతో డొనేషన్లు తీసుకున్నారనిఆరోపణపై ఐటీ మంత్రి మల్లారెడ్డి, ఆయన బంధువుల ఇళ్లలో రెండు రోజుల ఐటీ సోదాలు చేపట్టింది. ఈనేపథ్యంలో మల్లారెడ్డి, ఐటీ అధికారుల పరస్పర పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేసుకున్నారు.
మంత్రి మల్లారెడ్డి, బంధువుల ఇళ్లలో ఐటీ సోదాలు ముగిసాయి. రెండు రోజుల పాటు 65 బృందాలతో దాదాపు 400 మంది ఐటీ అధికారులతో సోదాలు నిర్వహించారు. ఇప్పటి వరకు రూ.10.50 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు ఐటీ అధికారులు.
చామకూర మల్లారెడ్డి. 2018 ఎన్నికల్లో మేడ్చల్ నుంచి గెలిచి.. ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. ఎమ్మెల్యేగా తొలిసారే గెలిచినా.. ఆయనకు కేబినెట్‌లో చోటుకల్పించారు సీఎం కేసీఆర్. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి టికెట్‌ను తన అల్లుడు రాజశేఖర్‌రెడ్డికి ఇప్పించుకున్నారు మల్లారెడ్డి. కానీ.. రేవంత్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. అల్లుడి ఓటమి మల్లారెడ్డి రాజకీయ భవిష్యత్‌పై తీవ్ర ప్రభావం చూపించిందని పార్టీ వర్గాల్లో చర్చ సాగింది. దానికితోడు కార్మికశాఖ మంత్రిగా మల్లారెడ్డి పనితీరు బాగోలేదనే రిపోర్ట్స్ వెళ్లాయట. సీఎం కేసీఆర్ అసంతృప్తి…
ఘట్‌కేసర్‌లో రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెడ్డి సింహగర్జన సభకు హాజరయ్యారు మంత్రి మల్లారెడ్డి. అప్పటి వరకు బాగానే సాగిన మంత్రి మల్లారెడ్డి స్పీచ్ పై అక్కడ కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ సర్కార్ పథకాలను ఆయన వివరించడంతో పరిస్థితి మారిపోయింది. ప్రసంగం తర్వాత సభ నుంచి తిరిగి వెళ్లిపోతున్న మల్లారెడ్డి కాన్వాయ్‌పై కొందరు దాడి చేయడం రాజకీయ వేడి రగిలించింది. ఈ దాడి వెనక పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మనుషులు ఉన్నారని ఆరోపించారు…
మంత్రి మల్లారెడ్డి అలాగే.. ఆయన కుటుంబ సభ్యుల చుట్టూ భూ వివాదాలు నడుస్తూనే ఉన్నాయి.. ఇప్పటికే పలు సందర్భాల్లో మంత్రి, ఆయన కుటుంబ సభ్యులపై ఆరోపణలు రాగా.. తాజాగా మరోసారి మంత్రి మల్లారెడ్డికి చిక్కుల్లో పడినట్టు అయ్యింది.. ఎందుకంటే.. మంత్రి మల్లారెడ్డి బామ్మర్ది, గుండ్లపోచంపల్లి మున్సిపల్ ఛైర్పర్సన్ భర్త అయిన ముద్దుల శ్రీనివాసరెడ్డి భూ వివాదంలో చిక్కుకున్నాడు. భూ వివాదంలో మంత్రి మల్లారెడ్డి బామ్మార్ది, గుండ్లపోచంపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ భర్త మద్దుల శ్రీనివా్‌సరెడ్డితో పాటు 15 మందిపై…