మాజీమంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని తెలిపారు. ఇదిలా ఉంటే.. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొన్నారు. ఐదేళ్లు బీఆర్ఎస్ ను వదిలేది లేదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం తన వయసు 71 సంవత్సరాలని.. ఈ సమయంలో పార్టీ మారే అవకాశం లేదన్నారు. ఈ ఐదేళ్లు ప్రజా సేవ చేసి, రాజకీయాల నుంచి వైదొలుగుతానని మల్లారెడ్డి తెలిపారు.
మేడ్చల్ మల్కారిగిరి జిల్లా దుండిగల్ పరిధిలోని మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి కళాశాలకు చెందిన భవనాలను అధికారులు కూల్చివేశారు.
బీజేపీతో బీఆర్‌ఎస్ పొత్తుపై మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడారు. బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు వుంటే మా ఎమ్మెల్యేలు టచ్‌లో వున్నారని బండి సంజయ్ ఎందుకు మాట్లాడతారని మల్లారెడ్డి ప్రశ్నించారు.
Bandla Ganesh: సినీ నిర్మాత బండ్ల గణేష్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీ స్థానం నుంచి పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు.
Malla Reddy: మాజీ మంత్రి మల్లారెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. మేడ్చల్ జిల్లా కేశవాపురం గ్రామంలో భూకబ్జా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై కేసు నమోదైంది.. గిరిజనుల భూములు కబ్జా చేశారని ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్‌లో మల్లారెడ్డిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేశారు. మల్లారెడ్డితో పాటు ఆయన అనుచరులు తొమ్మిది మందిపై కేసులు నమోదు అయ్యాయి.
Sandeep Reddy Vanga: ఇంకో రెండు రోజుల్లో ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తున్న యానిమల్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది రణబీర్ కపూర్, రష్మిక జంటగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ సినిమాపై మరింత హైప్ ను తీసుకొచ్చి పెట్టాయి.
MallaReddy: బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్, రష్మిక జంటగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం యానిమల్. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వైల్డ్ యాక్షన్ ఎంటర్ టైనర్ యానిమల్ ఎట్టకేలకు డిసెంబర్ 1 న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం 5 భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది.