Marri Rajashekar Reddy : మల్కాజిగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లేకపోవడం వలన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయడానికి వినూత్నంగా నిరసన తెలిపారు స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. జీహెచ్‌ఎంసీ కార్యాలయం ఎదుట ఉన్న చెట్టు కింద కూర్చొని ప్రజలతో కలిసి ఎమ్మెల్యే ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా ఒక శాశ్వత క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయాలని ఇప్పటికే ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా, అధికారుల వద్ద విజ్ఞప్తులు…
Marri Rajashekar Reddy: మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు, ప్రస్తుత మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిపై చీటింగ్ కేసు నమోదైంది. యేసుబాబు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు నమోదయ్యింది. ఈ కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. యేసుబాబు ఫిర్యాదు ప్రకారం “విజన్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ సర్వీస్” సంస్థ ద్వారా ఆయన అరుంధతి హాస్పిటల్‌కు సిబ్బంది సమకూర్చినట్లు పేర్కొన్నారు. మొత్తం 40 మంది సిబ్బందిని అందించగా.. అందుకు గాను రూ.50 లక్షలు చెల్లిస్తామని రాజశేఖర్…
మల్కాజ్గిరి మరోసారి రాజకీయ కక్షలతో రణరంగంగా మారింది. మల్కాజ్గిరి నియోజకవర్గం మౌలాలి ఆర్టీసీ కాలనీలో రోడ్డు పనులను సందర్శించడానికి వెళ్లిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పై మౌలాలి కాంగ్రెస్ నాయకులు దాడికి యత్నించారు. గత కొంతకాలంగా మౌలాలి డివిజన్ లోని ఆర్టీసీ కాలనీ రోడ్లు మరమ్మతులకు నోచుకోలేదు, తద్వారా స్థానిక ప్రజలు చాలా ఇబ్బందులకు గురయ్యారు.
పార్టీ సర్వేలో నిలిచేది ఎందరు?సర్వేలు.. వడపోతలు.. నిఘా వర్గాల నివేదికలు. ప్రస్తుతం టీఆర్ఎస్‌లో చర్చగా మారిన అంశాలివే. వీటి ఆధారంగానే టికెట్స్ కేటాయింపు ఉంటుందనే అంతర్గత చర్చ చాలామంది ఎమ్మెల్యేలలో గుబులు రేపుతోంది. సర్వేలో నిలిచింది ఎవరు? జారిపోయింది ఎవరు అనేది అంతుచిక్కని పరిస్థితి. ఇదే సమయంలో రకరకాల ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు ఎమ్మెల్యేలకు కునుకు లేకుండా చేస్తున్నాయి. ఉద్యమ పార్టీగా ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి.. 2014లో తొలిసారిగా అధికారంలోకి…