తాజాగా కేంద్ర అధినాయకత్వం ప్రకటించిన కమిటీలు.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మరోసారి చిచ్చురేపాయి.. తమకు అన్యాయం జరిగిందంటూ.. సీనియర్లు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. పీసీసీ-సీఎల్పీ మధ్య అసలు సమన్వయమే లేదు అనేది వారిమాటల్లోనే స్పష్టం అవుతోంది.. ఇదే, సమయంలో పార్టీలో కోవర్టుల వ్యవహారం కూడా తెరపైకి వచ్చింది.. వీటిపై సీరియస్‌గా స్పందించారు కాంగ్రెస్ నేత మహేశ్వర్ రెడ్డి.. పార్టీలో కోవర్టులు ఉన్నారని చెప్పిన వాళ్లే ఎవరన్నది చెప్పాలని డిమాండ్ చేశారు.. ప్రతీసారి ఈ చర్చ ఎందుకు…
తెలంగాణలో బీజేపీకి ఉన్నది 5 శాతం ఓటింగ్ మాత్రమే… రాష్ట్రంలో టీఆర్ఎస్‌కి అసలైన ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు కాంగ్రెస్ నేత మహేశ్వర్‌రెడ్డి.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. పార్టీలో సమీక్ష జరగాల్సిన అవసరం ఉందన్నారు.. మర్రి శశిధర్ రెడ్డికి షోకాజ్ నోటీసులు ఇవ్వాల్సిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ఆయన.. పార్టీ మీద ఆయన చేసిన కామెంట్స్ క్షమించలేనివి.. కానీ, మర్రి శశిధర్ రెడ్డికి నోటీసులు ఇచ్చే పరిధి ఏఐసీసీది అన్నారు.. బయటకు వెళ్లివాళ్లను…
గద్వాల జిల్లాలో న్యూడ్ వీడియో కాల్ వ్యవహారం కలకలం రేపుతోంది. ప్రేమ పేరుతో మహిళలను, విద్యార్థినులను ట్రాప్ చేస్తున్నారు కామాంధులు. మహిళలను మాటలతో ముగ్గులోకి దించి న్యూడ్ వీడియోకాల్ చేసేవిధంగా ట్రాప్ చేస్తున్నారు.
తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన అంశాలను తెర మీదకు తెచ్చారు రేవంత్ రెడ్డి… తెలంగాణ తల్లి విగ్రహం, రాష్ట్రానికి కొత్తగా జెండా ఏర్పాటు అంశాలపై కార్యాచరణ రూపొందించారు. దీనిపై జానారెడ్డి నివాసంలో సీనియర్ నేతలు భేటీ అయ్యారు. పీసీసీ చీఫ్ రేవంత్, దామోదర రాజనర్సింహ.. షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి.. మధు యాష్కీ మీటింగ్‌కు హాజరయ్యారు.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ల భేటీలో సెప్టెంబర్ 17, కొత్తగా ఏర్పాటు చేసే తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై చర్చించారు. ఇప్పుడు…
మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు.. మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి. ఇద్దరూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతలు. వేర్వేరు వర్గాలు. తూర్పు.. పడమర ప్రాంతాలకు చెందిన నాయకులు. మహేశ్వర్‌రెడ్డి ప్రస్తుతం AICC కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్‌గా ఉన్నారు. ఇన్నాళ్లూ అంతర్గత కలహాలతో ఎడముఖం పెడముఖంగా ఉన్న ఇద్దరూ.. ప్రస్తుతం యుగళగీతం ఆలపించడం పార్టీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. అధిష్ఠానం ఒత్తిడో ఏమో ఇద్దరూ ఒకే లైన్‌లోకి వచ్చారు. ఇలాంటి సమయంలో ప్రేమ్ సాగర్‌రావు చేసిన ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.…