మూసీ బాధితులకోసం బీజేపీ నేడు హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ చౌక్ వద్ద మహా ధర్నా చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ధర్నాలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేఎల్పీ నేత ఏలేటి మాహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేఎల్పీ నేత ఏలేటి మాహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. మీ హయాంలోనే ఆ ఇండ్లకు అనుమతి ఇచ్చారు.. ఇప్పుడు ఎలా అక్రమమయ్యాయో రేవంత్ సమాధానం చెప్పాలన్నారు. మూసీ సుందరీకరణను ఏటీఎం లాగా మార్చుకోవాలనుకుంటున్నారా అని ఆయన…
ఈరోజు సాయంత్రం బీజేఎల్పీ సమావేశం నిర్వహించారు. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ భేటీ నిర్వహించారు. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన శాసనసభ పక్ష సమావేశం జరిగింది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహం, ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చించారు.
మహేశ్వర్ రెడ్డికి ఇప్పుడు బుద్ది వచ్చిందని, సివిల్ సప్లై కార్పోరేషన్ అప్పులకు మీ పార్టీ బాధ్యత లేదా అని ప్రశ్నించారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆరోపణలు చేసి పెద్దోడు ఐపోతా అనుకుంటే ఎలా.. ఆరోపణలు చేయడానికి కొంత ఇంగిత జ్ఞానం ఉండాలన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ఇద్దరు ఒక్కటై..ఆరోపణలు చేయడంలో కూడా ఒక్కటయ్యారని, ఆలోచించి మాట్లాడాలన్నారు. పేపర్లో పేరు వస్తుంది అని..మాట్లాడితే ఎట్లా.. మహేశ్వర్ రెడ్డి ఆరోపణలు చేస్తున్న సంస్థలు కేంద్రం…
ఉత్తమ్ స్పందన కోసం నిన్న పొద్దుపోయేదాకా ఎదురు చూసిన.. నేను వాస్తవాలు చెప్పాను కాబట్టే ఉత్తమ్ మొహం చాటేశారని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. ఏం చేయాలో తెలియక నాపై పోలీస్ కేసు పెట్టించారని, ఉత్తమ్ కు చేతనైతే బహిరంగ చర్చకు రావాలన్నారు మహేశ్వర్ రెడ్డి. లేదా సిట్టింగ్ జడ్జితో కమిటీ వేసిన సరే సాక్ష్యాధారాలతో నిరూపించడానికి రెడీ గా ఉన్నానని, సివిల్ సప్లై లో ఉన్న…
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద బీజేపీ ఫ్లోర్ లిడర్ ఏలేటి మహేశ్వరెడ్డి బట్టకాలల్చి మీద వేస్తుండు అని వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మండిపడ్డారు. ఎందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఆయన కు ఎందుకు కోపమొచ్చిందో అర్థం కాట్లేదని ఆయన అన్నారు. ఉత్తమ్ వైట్ పేపర్ లాంటి వాడు,ఆయన మీద బురద జల్లుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక వర్షాలు పడి ధాన్యం తడిసిందన్నారు జగ్గారెడ్డి. తడిసిన ప్రతి గింజా ప్రభుత్వం కొంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,…
రేవంత్ రెడ్డి రీసర్చ్ చేసి మరీ దోపిడీ చేస్తున్నారని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. ఇవాళ బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అబద్దాల పునాదుల మీద, రాష్ర్ట ప్రజలని మోసం చేసి గద్దేనెక్కిండని, కడుపు కట్టుకుంటే 40 వేల కోట్లు బ్యాంక్ లకు కట్టొచ్చు అంటున్నావు.. ఎలా వస్తాయన్నారు. ఇప్పుడు RRR టాక్స్ రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ దందా అని, హైదరాబాద్ పరిసరాల్లో పర్మిషన్ లు ఆపి… ఇప్పుడు…
కాంగ్రెస్ పార్టీ స్కాంల మీదగా నడిచే పార్టీ అని విమర్శించారు బీజేపీఎల్పీ మహేశ్వర్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పథకాల పైన నడిచే పార్టీ బీజేపీ అని ఆయన అన్నారు. 100 రోజుల్లో అరు పథకాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఏ ఒక పథకంమైన అమలు చేశారా అని ఆయన ప్రశ్నించారు. ప్రజలకు మోసం చేసి గద్దె నెక్కిన నాయకుడు రేవంత్ అని, ఎన్నికల్లో ప్రజలకు పథకాల ఇస్తామని ఓట్లు దండుకున్నారని ఆయన అన్నారు.…
రేవంత్ రెడ్డి మతిస్థిమితం కొల్పోయాడా…. గజినిగా మారాడా అని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొత్త అంశాలను తెరమీదకు తీసుకు వస్తున్నారని, కాళేశ్వరం పోయింది పోన్ ట్యాపింగ్ వచ్చింది… పోన్ ట్యాపింగ్ పోయి మరో అంశం తెరపైకి తెచ్చారన్నారు మహేశ్వర్ రెడ్డి. రెఫరెండం అన్నావు 14 సీట్లు గెలుస్తామని అన్నావు… 14 గెలిస్తే నేను రాజీనామా చేస్తా అన్న మీరు స్పందించలేదని, రేవంత్ రెడ్డి, హరీష్ రావు లు కలిసి…
మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ పార్టీని ఓడించే ప్రయత్నం చేస్తున్నారని స్వయంగా సీఎం చెబుతున్నారన్నారు బీజేపీ శాసనసభా పక్ష నేత మహేశ్వర్ రెడ్డి. ఇవాళ బీజేపీ శాసనసభా పక్ష నేత మహేశ్వర్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారని స్వయంగా రేవంత్ అనుకుంటున్నారన్నారు. పిసిసి పదవీ వేరే.. సిఎం పదవీ వేరే అని, సీఎం పదవి కోసం పది మంది పోటీపడుతున్నారన్నారు మహేశ్వర్ రెడ్డి. సెకండ్ పోజిషన్…