Maheshwar Reddy Denies Rumours Of Leaving Congress: కోటమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన తర్వాత.. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి కూడా ఆ పార్టీని వీడనున్నట్టు వార్తలొచ్చాయి. అయితే.. ఈ వార్తల్లో వాస్తవం లేదని ఆయన తోసిపుచ్చారు. కాంగ్రెస్‌లో తనకు గౌరవం ఉందని, తన రాజకీయ భవిష్యత్తు ఈ పార్టీలోనే అని నిర్ణయం తీసుకున్నానన్నారు. తాను ఏఐసీసీకి ఫిర్యాదు చేసినట్టు వస్తోన్న ప్రచారాల్లో నిజం లేదని, తానెలాంటి లేఖ రాయలేదని స్పష్టం చేశారు. ఏది ఉన్నా తాను మీటింగ్‌లోనే చర్చిస్తానని.. రాజీనామా విషయం కూడా స్టాఫ్‌తో చర్చించాకే బయటకు వచ్చిందని క్లారిటీ ఇచ్చారు.
చావో రేవో.. ఏదేమైనా తాను కాంగ్రెస్ పార్టీతోనే తేల్చుకుంటానని మహేశ్వర్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలా పని చేస్తామన్నారు. మునుగోడు ఎన్నికల కోసం 170 మందితో ఒక ప్రత్యేకమైన టీమ్‌ని ఏర్పాటు చేశామని, ఎన్నికల స్ట్రాటజీ కూడా సిద్దం చేస్తున్నామని వెల్లడించారు. మాణిక్యం ఠాగూర్‌తో తనకు మంచి రిలేషన్ ఉందని, కాంగ్రెస్‌లో ఇప్పుడు ఎలాంటి వివాదాలూ లేవని అన్నారు. అన్ని మాట్లాడుకుంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయని, లోపల మాట్లాడుకునే విషయాలు బయటకొస్తేనే చర్చకు దారితీస్తాయని తెలిపారు. కాంగ్రెస్ తనకు అత్యంత గౌరవమిచ్చిందని, ఈ పార్టీలోనే ఉంటానని ఆయన ముక్తకంఠంతో చెప్పారు.