TPCC Mahesh Kumar : జల్-జమీన్-జంగిల్ (నీరు, భూమి, అటవీ వనరులు) నినాదాన్ని ఆధారంగా తీసుకుని గిరిజనుల హక్కుల సాధనకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చారు. ఆదివారం నాగార్జునసాగర్‌లోని విజయ్ విహార హోటల్‌లో నిర్వహించిన ఆదివాసీ శిక్షణ శిబిరంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, సహజ వనరులపై గిరిజనుల హక్కుల కోసం రాహుల్ గాంధీ యాత్ర చేసిన విషయాన్ని గుర్తుచేశారు. రాహుల్ గాంధీ ప్రధానిగా చూడటం తమ కల అని, ఆ కల నెరవేర్చేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు సైనికులుగా పనిచేయాలని సూచించారు. ప్రజల సమస్యలు, బాధలను అర్థం చేసుకోవడమే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర లక్ష్యమని వివరించారు.
గిరిజన హక్కులను బీజేపీ ప్రభుత్వం కాలరాస్తోందని విమర్శిస్తూ, రాహుల్ గాంధీ గిరిజన అభివృద్ధి కోసం పరితపిస్తున్న నాయకుడని ప్రశంసించారు. నాగార్జునసాగర్ శిక్షణ శిబిరాలకు నిలయమని, ఈ ప్రాంతం గిరిజన శిక్షణకు అనువుగా ఉందని అభిప్రాయపడ్డారు.
Pushpa – 2 : రూ. 800 కోట్లతో బాలీవుడ్ లో పుష్పరాజ్ NO -1
కాంగ్రెస్ పార్టీ గిరిజనుల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తోందని, అటవీ హక్కుల చట్టం తీసుకురావడంలో తమ పాత్రను గుర్తుచేశారు. కులగణన సర్వేపై చర్చ కొనసాగుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ, సర్వే 90% పూర్తయిందని తెలిపారు. గిరిజనులు తమ హక్కుల సాధన కోసం సంఘటితంగా నిలవాల్సిన అవసరాన్ని ఉద్ఘాటించారు.
ఈ శిక్షణ శిబిరంలో ఏఐసీసీ ఇన్‌చార్జ్ దీపా దాస్ మున్షి, కో-ఆర్డినేటర్ కొప్పుల రాజు, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, ఇతర డీసీసీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అభ్యర్థులు, కార్పొరేషన్ చైర్మన్‌లు, సీనియర్ నేతలు పాల్గొన్నారు.
Ramesh Bidhuri: నేను ఎమ్మెల్యేగా గెలిస్తే.. కల్కాజీ రోడ్లను ప్రియాంక బుగ్గల్లా తయారు చేస్తా..