తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) కొత్త అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఇవాళ (బుధవారం) ఢిల్లీకి వెళ్లనున్నారు. అధిష్ఠానం పెద్దలను కలిసి తనను అధ్యక్షుడిగా నియమించినందుకు ధన్యవాదాలు తెలియజేయనున్నారు.
ప్రభుత్వానికి, పార్టీకి వారధిగా పని చేస్తానని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఎన్టీవీతో ప్రత్యేకగా చెప్పారు. పీసీసీలో 60 శాతం పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీలకే వస్తాయని అన్నారు. పీసీసీ బీసీకి ఇస్తే.. పూర్తి వాటా దక్కింది అనుకోమని చెప్పారు. మరోవైపు.. కష్టపడి పనిచేసే వారికి పదవులు వస్తాయని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.
TPCC Chief : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ నియామకమయ్యారు. టీపీసీసీ చీఫ్‌గా మహేష్‌కుమార్‌గౌడ్‌ను నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. బీసీ వర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్‌కు పగ్గాలు అప్పగిస్తూ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. కొత్త పీసీసీ చీఫ్ నియామక ఆదేశాలను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ విడుదల చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా మహేష్ కుమార్ గౌడ్ పని చేస్తున్నారు. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కూడా పని చేసిన…
హరీష్ రావు వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల సహకారంతోటే యథేచ్ఛగా చెరువులు కబ్జాలకు గురైనవి అని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందే భూములు కబ్జా చేయడానికి అని ఆయన మండిపడ్డారు. పది ఏండ్లలో బీఆర్ఎస్ నాయకులు యథేచ్ఛగా ప్రభుత్వ భూములు,111, ఎఫ్టిల్, బఫర్ జోన్ భూములన్ని కబ్జా చేసిండ్రు అని ఆయన విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ…
క్రోధి నామ సంవత్సరంలో కోపం తగ్గించుకొని కార్యకర్తలంతా పాజిటివ్ దృక్పథంతో పనిచేయాలని ఎమ్మెల్సీ, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఇవాళ ఆయన ఉగాది పండుగను పురస్కరించుకొని ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వస్తున్నాయన్నారు. ప్రజల అభీష్టం మేరకు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో అద్భుతంగా పాలన కొనసాగిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రతీ కార్యకర్త…
ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పొలం బాట పేరుతో రైతుల వద్దకు వెళ్తుంటే చాలా విచిత్రంగా ఉందన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి తీర్థ యాత్రలకు పోయినట్టు ఉందని, రాష్ట్రంలో ఏనాడైనా పంటల బీమా డబ్బులు కానీ, కరువు, వరదలు వచ్చి రైతులు తీవ్రంగా నష్టపోయిన సందర్భంగా ఏనాడైనా కేసీఆర్ రైతుల వద్దకు పోయారా అని ఆయన ప్రశ్నించారు. అధికారంపొయాక ఇప్పుడు…
బీజేపీ దేశాన్ని దోచుకుంటుందని, కాంగ్రెస్ అకౌంట్లు సీజ్ చేసింది మోడీ సర్కారు అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అకౌంట్ సీజ్ చేసి 100 కోట్లు విత్ డ్రా చేసుకుందని, 14 లక్షల రూపాయలు.. ఎంపీ లు క్యాష్ రూపంలో ఇచ్చారు అని అకౌంట్స్ క్లోజ్ చేశారన్నారు. పార్లమెంట్ ఎన్నికల ముందు ఇలా అకౌంట్స్ క్లోజ్ చేయడం బీజేపీ రాజకీయ దిగజారుడు తనం కి నిదర్శనమని ఆయన…
Mahesh Kumar Goud: బీజేపీ మాజీ ఎమ్మెల్యే NVSS ప్రభాకర్ పై ఎమ్మెల్సీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. తమ పార్టీ రాష్ట్ర వ్యవహాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీపై అబద్దపు వ్యాఖ్యలు చేసిన ప్రభాకర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.