Corona: మహారాష్ట్రలో కరోనా కొత్త వేరియంట్.. యమా డేంజరట!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Corona: ప్రభావం తగ్గిందనుకున్న ప్రతీసారీ నేనెక్కడికీ పోలేదు.. ఉన్నానంటూ కరోనా మహమ్మారి గుర్తుచేస్తూనే ఉంది. మొన్నటిదాకా పూర్తిగా కంట్రోల్ లోకి వచ్చిన కరోనా మళ్లీ విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. పండుగ సీజన్ లో రోజువారీ కేసుల సంఖ్య పెరగడంతో పాటు మహారాష్ట్రలో కొత్త, అత్యంత వేగంగా వ్యాప్తి చెందే వేరియంట్లు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో అక్కడ ఆందోళనకర పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఇప్పటిదాకా వెలుగు చూసిన కరోనా వేరియంట్లలో ప్రమాదరక, వేగంగా వ్యాప్తి చెందేది ఎక్స్ఎక్స్ బీ అని నిపుణులు భావిస్తున్నారు. గత వారంలో ముంబై, థానే, పూణే, రాయ్‌గడ్‌లోని ఎక్కువ జన సాంద్రత కలిగిన ప్రాంతాల్లో ఈ వేరియంట్ వెలుగు చూటడం ఆందోళన రేకెత్తించింది. ఈ నెల 10–16 తేదీల మధ్య కేసుల సంఖ్య 17.7 శాతానికి పైగా పెరిగినట్లు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.
Read Also: Madhya Pradesh:చిన్నారి మృతదేహంతో మేనమామ.. టిక్కెట్ కి కూడా డబ్బుల్లేవు
Also Read
- Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
- Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
- Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
- Ajit Agarkar: మనసు మార్చుకున్న అజిత్ అగార్కర్.. తుది నిర్ణయం బీసీసీఐకి వెల్లడి...
ఎక్స్ ఎక్స్ బీ వేరియంట్ ఇప్పటిదాకా 17 దేశాలకు వ్యాపించింది. బీఏ 2.75, బీజే.1 సబ్-వేరియంట్‌ల కంటే దీని వృద్ధి ఎక్కువగా ఉందని నిపుణులు భావిస్తున్నారు. గత ఆరు నెలల్లో భారత దేశంలో దాదాపు 90 శాతం కొత్త ఇన్‌ఫెక్షన్‌లు బీఏ .2.75 వల్ల సంభవించాయని, ఎక్స్ ఎక్స్ బీ 7 శాతంగా ఉందని తేలింది. ఈ సంవత్సరం ఆగస్టులో సింగపూర్ లో వెలుగు చూసిన ఎక్స్ ఎక్స్ బీ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఎక్స్ ఎక్స్ బీ స్పైక్ ప్రోటీన్ పై ఏడు ఉత్పరివర్తనాలను కలిగి ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను కూడా తప్పించుకుంటుంది కాబట్టి వ్యాప్తి రేటు భారీగా ఉందని నిపుణులు చెబుతున్నారు. వృద్ధులు, దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్లు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. మాస్కులు ధరించాలని సూచించారు.
తాజావార్తలు
-
Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
-
Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
-
Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
-
Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!