Bomb Threat: మహారాష్ట్ర రాజధాని ముంబైలో 3 చోట్ల బాంబు పేలుళ్లు జరుగుతాయని బుధవారం బెదిరింపు ఫోన్ కాల్ రావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హెల్ప్‌లైన్ నంబర్ 112కి కాల్ చేసిన ఓ వ్యక్తి ముంబైలో బాంబు పేలుళ్లు జరుగుతాయని తెలిపినట్లు వెల్లడించారు. తదుపరి చర్యలు తీసుకునేందుకు కాల్ చేసిన వ్యక్తిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Power Bill: కరెంట్ బిల్లు చూస్తేనే షాక్.. వందల్లో వచ్చే బిల్లు.. వేలు దాటింది..!
ముంబైలోని ఇన్ఫినిటీ మాల్ అంధేరి, పీవీఆర్ మాల్ జుహు, సహారా హోటల్ వద్ద పేలుళ్లు జరుగుతాయని కాల్ చేసిన వ్యక్తి చెప్పినట్లు పోలీసులు తెలిపారు. బాంబు హెచ్చరికల నేపథ్యంలో సహారా ఎయిర్‌పోర్టు పోలీసులు, జుహు, అంబోలి, బంగూర్ నగర్ పోలీసులతో పాటు సీఐఎస్‌ఎఫ్, బీడీడీఎస్ బలగాలను ఆయా ప్రాంతాల్లో మోహరించారు. బాంబు పేలుళ్లకు సంబంధించిన ఫోన్ కాల్‌పై దర్యాప్తు ప్రారంభించారు. మంగళవారం రాత్రి 10:30 గంటల సమయంలో ఈ ఫోన్ కాల్ వచ్చిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ముంబై పోలీసులు కాల్ చేసిన వ్యక్తిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.