ఆర్థిక రాజధాని ముంబైను మరోసారి భారీ వర్షాలు ముంచెత్తాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు నగరం జలమయం అయింది. రహదారులు చెరువులను తలపించడంతో ఉదయాన్నే ఉద్యోగాలకు వెళ్లే వారంతా తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. ఇక పలుచోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
Heart attack: ఇటీవల కాలంలో వరస గుండెపోటు ఘటనలు కలవరపెడుతున్నాయి. యువతతో పాటు చిన్నపిల్లలు కూడా అకస్మాత్తు గుండెపోటుకు గురై మరణిస్తున్నారు. మహారాష్ట్రలోని కోల్హాపూర్ జిల్లాకు చెందిన 10 ఏళ్ల బాలుడు శ్రావణ్ అజిత్ గవాడే హార్ట్ ఎటాక్‌తో మరణించాడు.
పుణేలో ఓ హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది. భర్త ప్రాణాలను కాపాడేందుకు భార్య తన కాలేయాన్ని దానం చేసింది. అయితే వైద్యులు చేసిన కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలో దురదృష్టవశాత్తూ భార్యాభర్తలు ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే, పుణేకు చెందిన ఓ వ్యక్తి కొంతకాలంగా తీవ్రమైన లివర్ సమస్యతో బాధపడుతూ ఉన్నాడు. వైద్యులు కాలేయ మార్పిడి మాత్రమే చివరి మార్గమని సూచించారు. ఈ పరిస్థితుల్లో తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా భార్య ముందుకు వచ్చి భర్తకు కాలేయం…
Bride: ఆమెకు అప్పటికే 8 మంది పురుషులతో వివాహమైంది. పెళ్లి చేసుకోవడం ఎంచక్కా భర్తల్ని బ్లాక్మెయిల్ చేస్తూ వారి నుంచి డబ్బులు వసూలు చేయడమే వృత్తిగా పెట్టుకుంది. చివరకు 9వ పెళ్లి చేసుకునే సమయంలో పోలీసులకు పట్టుబడింది ఈ కిలాడీ ‘‘నిత్య పెళ్లికూతురు’’. మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. పురుషులను వివాహం చేసుకుని, వారి నుంచి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు విచారణలో తేలింది.
Truck: ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వేపై భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. రాయ్‌గఢ్ జిల్లాలోని ఖోపోలి సమీపంలో అదుపు తప్పిన ట్రక్కు 20 వాహనాలను ఢీకొట్టింది. కంటైనర్ ట్రక్కు ఘాట్ సెక్షన్లో వాలు నుంచి దిగుతుండగా బ్రేక్ ఫెయిల్ కావడంతో ఈ సంఘటన జరిగింది. నియంత్రణ కోల్పోయిన ట్రక్కు ముందున్న పదుల సంఖ్యలో వాహనాలనపు ఢీకొట్టింది. ట్రక్కు ఢీకొనడంతో పలు వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. ఎవరికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే చాలా మంది గాయపడ్డారు. Read Also: Srushti IVF…
Shocking Video: మహారాష్ట్రలోని సతారా పట్టణంలో ఓ 18 ఏళ్ల యువకుడు ఒక మైనర్ బాలికను బహిరంగంగా కత్తితో బెదిరించిన దారుణ ఘటన చేసుకుంది. 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. యువకుడు బాలిక మెడ వద్ద కత్తి పెట్టి బాలికను బెదిరించడంతో స్థానికులు, పోలీసుల తెలివైన చర్యలతో సురక్షితంగా రక్షించగలిగారు. ఈ గతనకు సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే.. సదరు బాలికతో పాటు అదే కాలనీలో…
Maharashtra: మహారాష్ట్ర శంభాజీనగర్‌లో ఓ వ్యక్తి, తనను తాను బాబాగా ప్రకటించుకుని భూతవైద్యం చేస్తున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ప్రజలను కర్రలతో కొట్టడం, బూట్లు నాకమని బలవంతం చేయడం, వైద్యం పేరుతో ‘‘మూత్రం’’తాగించడం వంటి ఘటనలు సథానిక అధికారుల దృష్టి వచ్చాయి.
రోడ్డు ప్రమాదాలు జరగడం సహజం. కొన్ని తెలిసి జరుగుతుంటాయి. ఇంకొన్ని అనుకోని విధంగా జరుగుతుంటాయి. అయితే అప్పుడప్పుడు కొన్ని పరిస్థితుల్లో స్కిడ్ అయి బండ్లు పడిపోతుంటాయి. కానీ ఒకే చోట ప్రమాదాలు జరుగుతుంటే మాత్రం అది వాహనదారుల తప్పు కాదు.