మహారాష్ట్ర రాజకీయాల్లో ఈ రోజు కీలక పరిణామం చోటు చేసుకోనుంది. సీఎం ఏక్ నాథ్ షిండే తన మెజారిటీని నిరూపించుకోనున్నారు. స్పీకర్ ఎన్నిక, బలనిరూపణ కోసం మహారాష్ట్ర అసెంబ్లీ జూలై 3,4 తేదీల్లో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలకు పిలుపునిచ్చింది. కాగా ఆదివారం స్పీకర్ ఎన్నిక జరిగింది. ఈ రోజు ఏక నాథ్ షిండే బలనిరూపణ పరీక్ష జరగనుంది. దీంతో ఈ రోజుతో మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి తెరపడే అవకాశం ఉంది. షిండే ప్రభుత్వం సులభంగానే మెజారిటీని ప్రూవ్…
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం తుది అంకానికి చేరుకుంది. ఈ రోజు, రేపు మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక, ఏక్ నాథ్ షిండే బలపరీక్ష కోసం ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తోంది. ఆదివారం మహారాష్ట్ర అసెంబ్లీ కొత్త స్పీకర్ గా బీజేపీ ఎమ్మెల్యే రాహుల్ నర్వేకర్ ఎన్నికయ్యారు. గత ఏడాది కాలంగా ఖాళీగా ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. తాజాగా ఏర్పడిన ఏక్ నాథ్ షిండే అసెంబ్లీలో తన సత్తాను నిరూపించుకుంది. మహారాష్ట్ర అసెంబ్లీ…
మహారాష్ట్రలో కొత్త ముఖ్యమంత్రిగా ఏక్ నాథ్ షిండే, డిప్యూటీగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేశారు. అయితే ప్రమాణ స్వీకార సమయంలో సీఎం, డిప్యూటీ సీఎంలకు గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ స్వీట్లు తినిపించడం, పుష్పగుచ్చాలు ఇవ్వడం ఇప్పుడు వైరల్ గా మారాయి. అయితే ఈ వివాదంపై ఎన్సీపీ నేత శరద్ పవార్ స్పందించారు. నేను ఎన్నో ప్రమాణస్వీకారాలను చూశానని.. ఇలా ప్రమాణం చేసిన వారికి గవర్నర్ స్వీట్లు తినిపించడం, పువ్వులు ఇవ్వడం ఎప్పుడు చూడలేదని ఆయన అన్నారు.…
ఇప్పటికే మహారాష్ట్రలో అధికారం కోల్పోయి, పార్టీని కోల్పోయే పరిస్థితికి ఉద్ధవ్ ఠాక్రేకు ఏర్పడింది. మెజారీటీ ఎమ్మెల్యేలు సీఎం ఏక్ నాథ్ షిండేకు మద్దతు ఇస్తుండటం, మూడింట రెండొంతుల మెజారిటీ ఏక్ నాథ్ షిండేకు ఉంది. వరస ఎదురుదెబ్బలు తగులుతున్న శివసేన, ఉద్ధవ్ వర్గానికి సుప్రీం కోర్టులో చుక్కెదురు అయింది. శివసేన చీఫ్ విప్ సునీల్ ప్రభు, సీఎం ఏక్ నాథ్ షిండేతో పాటు, 15 మంది ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేయాలని కోరుతూ.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు.…
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి ఎండ్ కార్డ్ పడింది. శివసేన నేత ఏక్ నాథ్ షిండే తన వర్గం ఎమ్మెల్యేలతో గౌహతిలో క్యాంప్ పెట్టినప్పటి నుంచి సినిమాను తలపించే ట్విస్టులతో రాజకీయం రసవత్తంగా సాగింది. ఓ వైపు ఉద్ధవ్ ఠాక్రే, శరత్ పవార్, మరో వైపు ఫడ్నవీస్, ఏక్ నాథ్ షిండే ఇలా రెండు వర్గాల మధ్య ఎత్తులు పైఎత్తుల మధ్య అధికారం దోబూచులాడింది. చివరకు రెబెల్ నేత ఏక్ నాథ్ షిండే, బీజేపీ మద్దతుతో సీఎం పీఠాన్ని…
మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు దిశగా బీజేపీ కీలక అడుగులు వేస్తోంది. ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేయడంతో అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీ అధికారాన్ని చేపట్టేందుకు సిద్ధం అవుతోంది. మూడోసారి సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ పదవీ బాధ్యతలు చేపడుతారని.. డిప్యూటీ సీఎం పదవి ఏక్ నాథ్ షిండేకు వస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఇంట్లో బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరుగుతోంది. ప్రభుత్వ ఏర్పాటు గురించి బీజేపీ పెద్దలు చర్చిస్తున్నారు. సీటీ రవి,…
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం తుది అంకానికి చేరుకుంది. ఉద్ధవ్ ఠాక్రే రాజీనామాతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధం అవుతోంది. శివసేన రెబెల్ ఎమ్మెల్యేలు అంతా బీజేపీకి మద్దతు ప్రకటించనున్నారు. దీంతో మరోసారి మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం అవుతారని.. రెబెల్ నేత ఏక్ నాథ్ షిండే డిప్యూటీ సీఎం అవుతారని ప్రచారం సాగుతోంది. గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీకి తాము ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని దేవేంద్ర ఫడ్నవీస్ కోరనున్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే అధికారం జేజారిపోవడంపై…
మహారాష్ట్ర రాజకీయం తుది అంకానికి చేరుకుంది. బల పరీక్షకు ముందే ఉద్ధవ్ ఠాక్రే తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. బుధవారం సుప్రీం కోర్ట్ బలపరీక్షకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో ఉద్ధవ్ ఠాక్రే, గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీకి తన రాజీనామాను సమర్పించారు. దీంతో రెండున్నరేళ్లుగా అధికారంలో ఉన్న శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి కుప్పకూలింది. ఇదిలా ఉంటే మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ కు మార్గం సుగమం అయింది. గవర్నర్, ఫడ్నవీస్ ను…