Maharashtra: ఎలక్షన్ రిజల్ట్స్‌కి ముందు బీజేపీకి ఎదురుదెబ్బ.. ఉద్ధవ్ సేనలో చేరిన కీలక నేత..
- ఎలక్షన్ రిజల్ట్స్ ముందు బీజేపీకి ఎదురుదెబ్బ..
- ఉద్ధవ్ సేనలోకి ముంబై బీజేపీ నేత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra: శనివారంతో మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసేది ఏ పార్టీనో స్పష్టత రానుంది. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలకు ముందు ఆ రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. బీజేపీకి చెందిన కీలక నేత ఉద్ధవ్ ఠాక్రే శివసేనలో చేరారు. ముంబై బీజేపీ కార్యదర్శి, మహిమ్‌కి చెందిన సీనియర్ నేత సచిన్ షిండే, ఠాక్రే నేతృత్వంలోని శివసేన(యూబీటీ)లో చేరారు. ఇది బీజేపీ ఊహించని షాక్‌గా చెప్పవచ్చు. షిండే తన మద్దతుదారులతో కలిసి ఠాక్రే నివాసం మాతోశ్రీలో పార్టీలో చేరారు.
Read Also: US: యూఎస్ బీచ్‌లో అరుదైన ఫిష్ గుర్తింపు.. భారీ విపత్తుకు సిగ్నలా..!?
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
షిండే మణికట్టుకు సంప్రదాయ ‘‘శివబంధన్’’ని కట్టి ఠాక్రే పార్టీలోకి స్వాగతించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మహిమ్ అసెంబ్లీ స్థానంలో త్రిముఖ పోరు నెలకొంది. రాజ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) ఆయన కుమారుడు అమిత్ ఠాక్రేను ఈ స్థానం నుంచి అభ్యర్థిగా నిలిపింది. ఉద్ధవ్ ఠాక్రే యొక్క శివసేన (UBT) మహేష్ బలిరామ్ సావంత్‌ను తమ అభ్యర్థిగా దింపింది. ఏక్ నాథ్ షిండే శివసేన సిట్టింగ్ ఎమ్మెల్యే సదరా సర్వాంకర్‌ని నిలబెట్టింది.
288 స్థానాలు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబర్ 20న ఎన్నికలు జరిగాయి. శనివారం ఫలితలు వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీలు ‘మహాయుతి’ కూటమిగా, మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని ఉద్ధవ్ సేన, శరద్ పవార్ ఎన్సీపీలు ‘‘మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)’’ కూటమిగా పోటీ చేశాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. మహాయుతి విజయం సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.
తాజావార్తలు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!