Maharashtra Elections 2024: నవంబర్ 13న జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించడం ప్రారంభించాయి. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే పార్టీ శివసేన కూడా 45 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను మంగళవారం రాత్రి విడుదల చేసింది. ఈ జాబితాలో మొదటి పేరు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఉండగా.. ఆయన ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కోప్రి – పచ్‌పఖాడి స్థానం నుంచి పోటీ చేయనున్నారు. అలాగే, రాజ్ థాకరే కుమారుడు అమిత్ థాకరేపై సదా సర్వాంకర్ మహిమ్ నుంచి పోటీ చేస్తారు.
Read Also: Anti Aging Super Foods: ముఖంపై ముడతలు రాకుండా యవ్వనంగా కనిపించాలంటే ఇలా చేయాల్సిందే
ఇటీవలే భారత ఎన్నికల సంఘం చీఫ్ రాజీవ్ కుమార్ మహారాష్ట్రతో పాటు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికల తేదీలను ప్రకటించిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 13న ఒకే దశలో ఓటింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. నవంబర్ 23న జార్ఖండ్ అసెంబ్లీ, ఉప ఎన్నికలతో పాటు ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈసారి మహారాష్ట్రలో శివసేన (ఏక్‌నాథ్ షిండే) vs శివసేన (ఉద్ధవ్ థాకరే)గా మారనుంది.
Read Also: PM Modi- Xi Jinping: ఐదేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడితో ప్రధాని మోడీ ద్వైపాక్షిక భేటీ
శివసేన తొలి జాబితాలో మహిమ్ స్థానం నుంచి సదానంద్ శంకర్ సర్వాంకర్ అభ్యర్థిగా ఎంపికయ్యారు. ఎంఎన్ఎస్ అధ్యక్షుడు రాజ్ థాకరే కుమారుడు అమిత్ ఠాక్రే పోటీ చేస్తున్న స్థానం ఇదే. ఈ జాబితాలో తిరుగుబాటు తర్వాత ఉద్ధవ్ ఠాక్రే వర్గాన్ని విడిచిపెట్టి, ఏకనాథ్ షిండేలో చేరిన ఎమ్మెల్యేల పేర్లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా, ప్రస్తుత ప్రభుత్వంలోని షిండే వర్గానికి చెందిన పలువురు మంత్రుల పేర్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఏక్‌నాథ్ షిండే పార్టీ కొత్త ముఖాలలో రాజకీయ కుటుంబాల నుండి అనుభవజ్ఞులు, కొంతమంది స్వతంత్రులను చేర్చుకుంది. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల దాఖలుకు తొలిరోజైన మంగళవారం 57 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడం గమనార్హం. ఈ మేరకు ఎన్నికల సంఘం అధికారులు వివరాలను వెల్లడించారు.
Shiv Sena releases a list of 45 candidates for the upcoming #MaharashtraAssemblyElections2024
CM Eknath Shinde to contest from Kopri-Pachpakhadi Assembly constituency
Sada Sarvankar fielded from Mahim against Raj Thackeray's son Amit Thackeray pic.twitter.com/HdVhJEfawM
— ANI (@ANI) October 22, 2024