Devendra Fadnavis: లోక్‌సభ ఎన్నికల వలే ఓట్ జీహాద్ ఈసారి పనిచేయదు..
- రాబోయే ఎన్నికల్లో ఓట్ జిహాద్ పనిచేయదు..
- లోక్‌సభ సమయంలో కాంగ్రెస్ నకిలీ వ్యాఖ్యలు చేసింది..
- ఈ ఎన్నికల్లో గెలిచేది బీజేపీ కూటమి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Devendra Fadnavis: రాబోయే మహారాష్ట్ర ఎన్నికల్లో ‘‘ఓట్ జిహాద్’’, నకిలీ కథనాలు పని చేయలేయవని బీజేపీ నేత, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. ఎన్డీటీవీతో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఆయన ఈ వ్యాఖ్యలు చేవారు. నవంబర్ 20 ఎన్నికల తర్వాత మహాయుతి కూటమి మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆయన ఈ రోజు ధీమా వ్యక్తం చేశారు. ‘‘లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ జిహాద్ నిజమైన ఫ్యాక్టర్. ఒక నిర్దిష్ట వర్గానికి చెందిన ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా ఓటేశారు. మోడీని తొలగించడమే వీరి లక్ష్యం. ఈ సారి అది పనిచేయదు’’ అని ఫడ్నవీస్ అన్నారు.
Read Also: Jharkhand: జార్ఖండ్ ఎన్నికల బ్రాండ్ అంబాసిడర్‌గా టీమిండియా మాజీ కెప్టెన్..
Also Read
- Pakistan: పాకిస్తాన్‌కు FATF భయం.. జైష్ చీఫ్ మసూద్ అజర్‌పై బౌంటీ పెంపు..
- West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
- Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
- Rajasthan: రాజస్థాన్ ఎన్నికల్లో విచిత్రం.. బీజేపీ అభ్యర్థికి ఒక్కటే ఓటు, తన ఓటు కూడా పడలేదు!
లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని మొత్తం 48 సీట్లలో బీజేపీ కూటమి 17 సీట్లు మాత్రమే సాధించింది. కాంగ్రెస్-శరద్ పవార్-ఉద్ధవ్ ఠాక్రే కూటమి 30 సీట్లు గెలుచుకుంది. ‘‘లోక్‌సభ ఎన్నికల సమయంలో మహా వికాస్ అఘాడి ఒక నకిలీ కథనాన్ని సృష్టించారు. మేము దానిని సూటిగా ఎదుర్కొన్నాము. ఇప్పుడు వారు అబద్ధాలు చెప్పారని ప్రజలకు తెలుసు. వారు (ప్రధాని నరేంద్ర) మోడీజీ వచ్చి రాజ్యాంగాన్ని మార్చివేస్తారని, రిజర్వేషన్లను అంతం చేస్తారని అన్నారు. ప్రజలు మహావికాస్ అఘాడీకి ఓటేశారు. అయితే, రాహుల్ గాంధీ మాత్రం విదేశాలకు వెళ్లి రిజర్వేషన్లు తగ్గిస్తాం. వాటిని అంతం చేస్తామని అన్నారు’’ అని ఫడ్నవీస్ అన్నారు.
మహారాష్ట్రలో దళితుల ఓట్లు ముఖ్యమే కానీ, మహరాష్ట్ర వంటి పెద్ద రాష్ట్రాల్లో ఏ వర్గం కూడా ఎన్నికలను నిర్ణయించలేదని, లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నకిలీ వ్యాఖ్యల వల్లే దళితులు మాకు దూరమయ్యారని, కానీ ఇప్పుడు అలా జరగదని చెప్పారు. ఓ వర్గం మీడియా అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా, నాయకుల విమర్శలపై మాత్రమే చూపిస్తుందని అన్నారు. అయితే, ఫడ్నవీస్ వ్యాఖ్యల్ని ఉద్ధవ్ వర్గం ఎంపీ సంజయ్ రౌత్ తిప్పికొట్టారు. మీకు ముస్లింలు ఓటేస్తే ఓట్ జిహాద్ కాదు, మాకు ఓటేస్తే ఓట్ జిహాద్ అవుతుందా.? అని ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Varun Chakaravarthy: చెడ్డ బంతికి వికెట్ వస్తే ఆనందించను.. కారణమేంటో చెప్పిన వరణ్ చక్రవర్తి..
-
Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. “నా బిడ్డకు దక్కిన వరం” అంటూ ఎమోషనల్ పోస్ట్!
-
The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. ‘ది ప్యారడైజ్’ షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Pakistan: పాకిస్తాన్‌కు FATF భయం.. జైష్ చీఫ్ మసూద్ అజర్‌పై బౌంటీ పెంపు..
-
Srikanth Odela: ఒకప్పుడు సుకుమార్ శిష్యుడిగా.. ఇప్పుడు ఆయన కుర్చీలో డైరెక్టర్‌గా.. శ్రీకాంత్ ఓదెల లైఫ్ సర్కిల్ మూమెంట్!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!