ఒక సమూహం లేదా ఓటర్‌ను సులభంగా గుర్తించేందుకు వీలుగా సీసీ ఫుటేజీలు ఉపయోగపడతాయని ఎన్నికల కమిషన్ తెలిపింది. దీన్ని బహిర్గతం చేయడం వల్ల ఓటు వేసిన వారు, వేయని వారు సామాజిక వ్యతిరేక శక్తుల నుంచి ఒత్తిడికి గురవుతారు అని చెప్పింది.
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రమాణ స్వీకారానికి డిసెంబర్ 5 తేదీని కూడా ప్రకటించినప్పటికీ ముఖ్యమంత్రి ముఖంపై ఉత్కంఠ నెలకొంది. కొత్త ముఖ్యమంత్రి ఎవరు? అన్న ప్రశ్నకు నేడు సమాధానం దొరకనుంది. షిండేతో బీజేపీ చర్చలు జరుపుతుండగా.. ఆయన గ్రామానికి వెళ్లడంతో దేశవ్యాప్తంగా రాజకీయాల్లో చర్చ మొదలైంది.
Election Commission: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఎన్సీపీ శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే శివసేనల ‘‘మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)’’ ఘోర పరాజయం పాలైంది. రాష్ట్రంలోని మొత్తం 288 అసెంబ్లీ స్థానాల్లో కేవలం 49 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. కాంగ్రెస్ 100కి పైబడి సీట్లలో పోటీ చేస్తే కేవలం 16 చోట్ల విజయం సాధించింది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఫలితాలు కూడా వచ్చేశాయ్. మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. కానీ ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు ఏర్పడలేదు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆరు నెలలకు ముందు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి ఉవ్వెత్తున ఎగిసిపడింది. మహారాష్ట్రలో అత్యధిక లోక్‌సభ సీట్లను సొంతం చేసుకుంది. 48 లోక్‌సభ స్థానాలు ఉండగా.. అందులో కాంగ్రెస్ 13, ఉద్ధవ్ థాకరే పార్టీ 9, శరద్ పవార్ పార్టీ 8 లోక్‌సభ సీట్లు గెలుచుకుంది.
ఎన్నికల ఫలితాల సరళి చూస్తుంటే ఏదో తప్పు జరిగినట్లు కనిపిస్తోందని సంజయ్ రౌత్ అన్నారు. మా సీట్ల కొన్ని దోచుకున్నట్లు సమాచారం.. ఇది ప్రజల నిర్ణయం కానేకాదు అని పేర్కొన్నారు.
Exit Polls: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. అన్ని సర్వే సంస్థలు కూడా ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ కూటమి అధికారం చేపడుతుందని చెప్పాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం మహారాష్ట్ర, జార్ఖండ్‌లో బీజేపీ కూటమినే అధికారం వస్తుందని అంచనా వేశాయి.
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఓటింగ్ ముగిసింది. సినీ, రాజకీయ ప్రముఖులంతా ఓటింగ్‌లో పాల్గొన్నారు.
మహారాష్ట్ర, జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఎలాంటి అలజడి లేకుండా ప్రశాంతంగా పోలింగ్ నడుస్తోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు మహారాష్ట్రలో 45 శాతం, జార్ఖండ్‌లో 61 శాతం ఓటింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది.