మహారాష్ట్ర, జార్ఖండ్‌లో అసెంబ్లీ పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఓటు వేసేందుకు ప్రజలు పోలింగ్ బూత్‌లకు తరలివస్తున్నారు. ఇక ముంబైలో సినీ, రాజకీయ ప్రముఖులు ఓటు వేసేందుకు తరలివచ్చారు.
రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. మహారాష్ట్రాలో ఇద్దరు కోటీశ్వరులతో పేద ప్రజలు పోటీ పడుతున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా ధారావి మ్యాప్, గౌతమ్ అదానీ, నరేంద్ర మోడీల ఫొటోను ఆయన ఆవిష్కరించారు. అందులో మోడీ అంటే ఇదేనేమో.. ఒకటి ఉంటే మరోకటి సురక్షితం అని ఎద్దేవా చేశారు.
మహారాష్ట్ర సీఎం పదవి రేసులో తాను లేనని, అయితే సీఎం పదవి తనకు రావడం ఖాయమని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన ఓ జాతీయ మీడియా సంస్థతో ఇంటర్వ్యూలో మాట్లాడారు. తాను తప్పకుండా సీఎం అవుతానని ఆశాభావం వ్యక్తం చేశారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. కాగా.. ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ ఎంపీ, బీజేపీ నేత నవనీత్ రాణా ర్యాలీలో ప్రసంగించేందుకు అమరావతిలోని దరియాపూర్‌లోని ఖల్లార్ గ్రామానికి చేరుకున్నారు. ఆమె వేదికపై ప్రసంగం ముగించి కిందకు రాగానే కొందరు ఆమెపై కుర్చీలు విసిరేందుకు ప్రయత్నించారు. దీంతో ఈ ప్రచార సభలో పెద్ద దుమారమే రేగింది.
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఇండియా కూటమిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ టార్గె్ట్‌గా కేంద్రమంత్రి నిప్పులు చెరిగారు. ‘‘రాహుల్ బాబా’’ అనే పేరు కలిగిన విమానం ఇప్పటికే 20 సార్లు కూలిపోయిందని, నవంబర్ 20న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత 21వ సారి కూలిపోనుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా జోస్యం చెప్పారు
CM Yogi: మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం వాడీవేడిగా కొనసాగుతోంది. ముఖ్యంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది. మంగళవారం సీఎం యోగి మాట్లాడుతూ.. ఖర్గే చిన్నతనం నాటి ఘటనను గుర్తు చేశారు. సాధువులు, కాషాయం ధరించిన వారు రాజకీయం చేయొద్దని ఖర్గే చేసిన వ్యాఖ్యలు ధీటుగా బదులిచ్చారు.
Maharashtra : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ తీర్మానం లేఖను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు అంటే ఆదివారం ఉదయం 10.15 గంటలకు ముంబైలో విడుదల చేయనున్నారు.
CM Revanth Reddy: ప్రభుత్వం ఏర్పడిన పది నెలల్లోనే 50వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ముంబైలో చేరుకున్న సీఎం మీడియా సమావేశంలో మాట్లాడుతూ..
Maharashtra: నవంబర్ 20వ తేదీన జరగనున్న మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ఇటీవల ముగిసింది. కాగా 288 అసెంబ్లీ స్థానాల్లో పోటీ పడేందుకు మొత్తం 7,994 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో దిగినట్లుగా ఎన్నికల సంఘం తెలిపింది.
Maharashtra Elections: మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు మంగళవారం (అక్టోబర్ 29) నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ కాగా.. సుమారు 8 వేల మంది అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. నవంబర్ 20న జరగనున్న ఎన్నికల కోసం 7,995 మంది అభ్యర్థులు ఎన్నికల కమిషన్‌కు 10,905 నామినేషన్లు దాఖలు చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. అక్టోబరు 22న ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ 29వ తేదీతో ముగిసింది.…