తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది భారతీయ జనతా పార్టీ.. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు.. అధిష్టానం నుంచి తరచూ రాష్ట్రంలో పర్యటనలు కొనసాగిస్తున్నారు నేతలు.. ఇక, ఇవాళ పాలమూరులో బీజేపీ రాష్ట్ర పదాధికారులు, ముఖ్య నేతలు సమావేశం అయ్యారు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. ఈ భేటీకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ…
టీఆర్ఎస్ నేతల్లో అసహనం పెరుగుతోందా? అంటే అవుననే అంటున్నారు. ఒకే ప్రాంతానికి చెందిన నేతలు కలిస్తే అది పెద్ద వార్త కాదు. కానీ వివిధ ప్రాంతాలకు చెందిన ముగ్గురు అసంతృప్తి నేతలు కలవడం రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. మహబూబ్ నగర్ జిల్లా కు చెందిన టీఆర్‌ఎస్ నేత జూపల్లి కృష్ణారావు ఉమ్మడి జిల్లాలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును, ఖమ్మం లో పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలవడం వెనుక ఏం జరుగుతుందనేది చర్చకు దారితీస్తోంది. ఉమ్మడి మహబూబ్‌గర్…
మహబూబ్‌నగర్, నల్గొండ పట్టణాల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో మహబూబ్‌నగర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ, నీలగిరి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలు (UDAలు) ప్రధాన నగరాలు, పట్టణాల చుట్టూ చక్కటి సమగ్ర మరియు ప్రణాళికాబద్ధమైన మౌలిక సదుపాయాల అభివృద్ధిని నిర్ధారించడానికి ఏర్పాటు చేయబడ్డాయి. రోడ్డు నెట్‌వర్క్, నీటి సరఫరా, ఉపాధి అవకాశాలు మరియు శాటిలైట్…
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తెస్తున్నాం అంటే.. బీజేపీ నేతలకు ఎందుకు ఏడుపు వస్తుందోనని మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ పేద బిడ్డలు ఇంగ్లీష్ మీడయంలో చదువుకోవద్దా.. కార్పొరేట్ బుద్ధిని బీజేపీ మరోసారి బయట పెట్టిందన్నారు. వారికి తలొగ్గి విమర్శలు చేస్తుందని మంత్రి వ్యాఖ్యానించారు. ఉద్యోగాలు ఇస్తాం అంటే కోర్టుల్లో కేసులు వేస్తారు.. పేదలకు ఇంగ్లీష్…
మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం ఊకచెట్టు వాగుపై కురుమూర్తి స్వామి దేవాలయం వరకు కాజ్ వే బ్రిడ్జి, చెక్ డ్యామ్, బీటీరోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్ రెడ్డితో కలిసి భూమిపూజలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. 70 ఏళ్ళుగా ఇక్కడ ఎమ్మెల్యేలుగా.. మంత్రులుగా.. ముఖ్యమంత్రిగా కూడా పదవులు అనుభవించిన వారున్నారు.. వాళ్ళు ఈ ప్రాంతానికి ఏమైనా చేశారా అని ప్రశ్నించారు.…
మహబూబ్‌నగర్ నుంచి ఇప్పటికి ఎంతో మంది మంత్రులు వచ్చినా ఇప్పటి వరకు అభివృద్ధి కాలేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. అతి త్వరలోనే రూ. 200 కోట్ల నిధులతో కొత్తగా 900 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేస్తామని మంత్రి హరీష్ రావు తెలిపారు. మంగళవారం జిల్లాలోని బాలానగర్‌లో 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. అనంతరం…
మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం మద్దూరు గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ వివాహం చేసుకుందని తన కూతురు బతికుండగానే ఓ తండ్రి శ్రద్ధాంజలి ఘటించాడు. గుండు గీయించుకుని దినకర్మలు చేయించాడు. వివరాల్లోకి వెళ్తే… మద్దూరు గ్రామానికి చెందిన మాధవి అనే యువతి అదే గ్రామానికి చెందిన వెంకటేష్ అనే యువకుడిని ప్రేమించింది. ఇద్దరూ సమీప బంధువులే కావడంతో తమ ప్రేమను పెద్దల ముందుకు తీసుకువెళ్లారు. అయితే పెద్దలు ససేమిరా అనడంతో ఈనెల 13న గుడిలో పెళ్లి చేసుకున్నారు.…
తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ దోపిడీ చేస్తున్నారు బీజేపీ నేత డీకే. అరుణ అన్నారు. మంగళవారం మహబూబ్‌నగర్‌లో జరిగిన బీజేపీ నిరసన దీక్షలో ఆమె పాల్గన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… టీఆర్‌ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు. లక్షల కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం నిర్మిస్తే… ఎక్కడా ఒక్క చుక్క నీరు పారలేదని.. కేవలం కేసీఆర్ ఫామ్ హౌజ్ ఉన్న ఎర్రవెల్లికే నీటిని మళ్లించారని ఆరోపించారు. మూడేళ్లలో పాలమూరు రంగారెడ్డి కడతా అని.. 14 లక్షల ఎకరాలకు…
దేశ చరిత్రలో ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అని ఈటల రాజేందర్ అన్నారు. దీనికి కారణం సీఎం కేసీఆరే అంటూ తీవ్ర విమర్శలు చేశారు. మహబూబ్ నగర్ బీజేపీ నిరసన సభలో తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. ఉద్యోగ వర్గానికి సంఘీభావం కోసం బీజేపీ నేతలను రాష్ట్రానికి వస్తున్నారన్నారు. ప్రభుత్వం విమర్శించే కన్నా ముందుగా మీరు చేయాల్సింది స్థానికత ఆధారంగా ఉద్యోగులను సవరించాలని డిమాండ్ చేశారు. 317 జీవోను రద్దు…
మహబూబ్‌నగర్ జిల్లాలో గురువారం రాత్రి ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. అప్పాయిపల్లి స్టేజీ సమీపంలో 167వ నంబర్ జాతీయ రహదారిపై ఆటోను కారు ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఎంపీడీవో అటెండర్ విజయరాణి, ఆటో డ్రైవర్ ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర గాయాలపాలైన ఎంపీడీవో కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ జ్యోతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. Read Also: యాదాద్రిలో ఇక సేవలు ప్రియం.. ఉత్తర్వులు జారీ గాయపడ్డ…