భారత్ ను ఒకటి చేద్దాం అనే నినాదంతో పాదయాత్రకు రంగం సిద్ధం చేసింది కాంగ్రెస్. గాంధీ కుటుంబ వారసుడు రాహుల్ గాంధీ స్వయంగా పాదయాత్రకు పూనుకోవడం పార్టీకి బూస్ట్ ఇస్తుందనే అంచనాలుపెరిగాయి. సెప్టెంబర్ 7 నుంచే రాహుల్ భారత్ జోడో యాత్ర మొదలైంది.
పాఠశాలకు లేటుగా వచ్చానా, హోంవర్క్ రాయక పోయిన క్లాస్ లో వున్న ఉపాధ్యాయులు ఏంచేస్తారు. గుంజీలు తీయమనో, లేక క్లాస్ రూం బయటే నిలబడ మనో, గోడ కుర్చీ వేయమనో, పేరెంట్స్ ను పిలుచుకుని రావాలని ఇలాంటి రకాల రాకాల పనిష్ మెంట్లు ఇస్తుంటారు. ఇలాంటివి పాఠశాలలో వున్న పనిష్ మెంట్లు అయితే ఓ పాఠశాలలో లేటుగా కాదు, హోంవర్క్ రాయలేదని కాదు అమ్మయిలు జడలు వేసుకోలేదని గుంజీలు తీయించారు. అన్ని గుంజీలు తీయలేని విద్యార్థులు కన్నీరు…
తెలంగాణ అమ్మాయి సుచరిత మన్యాల కొత్త చరిత్ర సృష్టించింది. మహబూబ్ నగర్ నుంచి మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (మిట్) వరకు ప్రస్థానం కొనసాగించింది. కేంబ్రిడ్జ్(అమెరికా)లోని ఆ సంస్థలో సీటు సంపాదించటమే గొప్ప అనుకుంటే అందులోనూ ‘సిస్టమ్ డిజైన్ అండ్ మేనేజ్‌మెంట్’ కోర్సును ఇటీవలే సక్సెస్‌ఫుల్‌గా పూర్తిచేయటం విశేషం. ఈ రెండింటినీ సాధించటం ద్వారా ఆమె లింగ వివక్షను విజయవంతంగా అధిగమించారు. మహిళా సాధికారతకు వారధిగానూ నిలిచారు. Read Also: KCR: శ్రీలంక విషయంలో మాట్లాడకపోతే.. దోషిగా…
కొల్లాపూర్ లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఉమ్మడి మహబూబ్ నగర్ లో అధికార టీఆర్ ఎస్ పార్టీలో రాజకీయ హీట్ ఉత్కంఠ రేపుతుంది. కొల్లాపూర్ లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. నేతలిద్దరూ అధికార గులాబీ పార్టీకే చెందినవారే అయితే వీరిద్దరూ ఓపెన్ ఛాలెంజ్ చేసుకోవడం చర్చకు దారి తీస్తోంది. బహిరంగ చర్చకు సిద్దమంటూ ఒకరిపై మరొకరు ఛాలెంజ్ విసురుకోవడంతో.. ఆదివారం కొల్లాపూర్ లో టెన్షన్…
నగరంలో ఎండల తీవ్రత విపరీతంగా పెరిగింది. ఉక్కపోతతో భాగ్యనగర వాసులు అల్లాడుతున్నారు. గరిష్టంగా 41.2 డిగ్రీల ఉష్ణోగ్రత.. కనిష్టంగా 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ఎండల తీవ్రతతో ఇళ్ల నుంచి బయటకు రావటానికి సిటీ ప్రజలు జంకుతున్నారు. భానుడి భగభగలతో నగరంలోని రోడ్లు బోసిపోతున్నాయి. రోజుకు సగటున 41.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో నగరవాసులు ఉక్కపోతతో సతమతమవుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. గతేడాదితో పోల్చుకుంటే ఈసారి నగరంలో ఎండల తీవ్రత…
తెలంగాణపై గురిపెట్టిన బీజేపీ.. ఇతర పార్టీల నేతలను.. బీజేపీలోకి ఆహ్వానించే పనిలోపడింది.. ఇప్పటికే చాలా మంది నేతలతో కమలం పార్టీ నేతలు టచ్‌లోకి వెళ్లారట.. మరికొందరు.. వారికి టచ్‌లోకి వస్తున్నారట.. అయితే, పార్టీలో చేరికలు, ఇప్పటికే పార్టీలో ఉన్నవారు చెప్పే అభ్యంతరాలపై కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. బీజేపీ పదాధికారుల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. బూత్ స్థాయిలో పార్టీ విస్తరణకు పనిచేయాలని సూచించారు.. దళితుల బస్తీలకు వెళ్లి వాళ్ల సమస్యలు…
టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ మాత్రమే అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్… మహబూబ్‌నగర్‌లో జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మొదటి విడత పాదయాత్రతో తెలంగాణలో రాజకీయ వాతావరణం మారింది, ఇక, రెండో విడత పాదయాత్ర 5 జిల్లాల మీదుగా 348 కిలోమీటర్లు సాగుతోందన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, నిరుద్యోగం, డబుల్ బెడ్ రూం ఇళ్లపై చాలా మంది ఫిర్యాదులు వచ్చాయన్నారు. పాలమూరు…