ఈమధ్యకాలంలో నిత్యం వార్తల్లో నిలుస్తున్న ఎమ్మెల్యే ఎవరైనా వున్నారంటే ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తప్ప మరెవరూ కాదనే చెప్పాలి. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ గెలవరని, ఆయన గెలిస్తే తాను రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. ఈటల గెలవడంతో బాలరాజు పరిస్థితి ఘోరంగా మారింది. అన్నా ఎప్పుడు రాజీనామా చేస్తావంటూ బీజేపీ, ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు బాలరాజుపై వత్తిడి తేవడం మొదలెట్టారు. సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి.…
తెలంగాణకు హరిత హారం స్పూర్తితో, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా, సీడ్ బాల్స్ ను రికార్డు స్థాయిలో తయారు చేసి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా వెదజల్లడం, సీడ్ బాల్స్ తో అత్యంత పొడవైన వాక్యాన్ని నిర్మించడం ద్వారా సాధించిన గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డు’’ జ్జాపికను శుక్రవారం ప్రగతిభవన్ లో సీఎం కెసిఆర్ చేతులమీదుగా ఎంపీ జోగినపెల్లి సంతోష్ కుమార్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ లు అందుకున్నారు. వారి కృషిని సీఎం కెసిఆర్ అభినందించారు.…
తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కరోనా హైదరాబాద్ నగరంతో పాటుగా జిల్లాల్లోని చిన్న చిన్న మున్సిపాలిటీల్లో కూడా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలోని భుత్పూర్ మున్సిపాలిటీలో కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్న తరుణంలో అక్కడి మున్సిపాలిటీ కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపాలిటీ పరిధిలో స్వచ్చంద లాక్ డౌన్ ను విధించాలని నిర్ణయం తీసుకున్నారు. కరోనా తీవ్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు మున్సిపల్ చైర్మన్ బస్వరాజు గౌడ్ పేర్కొన్నారు. ఈరోజు…