Mahakumbh 2025 : మహాకుంభ మేళా మహోత్సవంలో జరిగిన భయంకర తొక్కిసలాట పై కీలక విషయం వెలుగులోకి వచ్చింది. అఖారా పరిషత్ అధ్యక్షుడు రవీంద్ర పురి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనవరి 29న మౌని అమావాస్య నాడు కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో 30మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఘటన వెనుక “కచ్చా-బనియన్” గ్యాంగ్ హస్తం ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ప్రస్తుతం యూపీ పోలీసులు తొక్కిసలాటకు సంబంధించిన అన్ని కోణాలను పరిశీలిస్తున్నారు. దీనిలో కుట్ర కోణం కూడా దాగి ఉందా అనే దిశగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
1990వ దశకంలో ఈ గ్యాంగ్ పేరు ఢిల్లీలో తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. ఈ గ్యాంగ్ సభ్యులు అత్యంత ప్లాన్ చేసి దొంగతనాలు, హత్యలు చేస్తుండే వారు. ప్రత్యేకంగా పొశ్ కాలనీల్లోని సంపన్న కుటుంబాలను లక్ష్యంగా చేసుకునే వారు. బహిరంగ ప్రదేశాల్లో ఉదయం భిక్షాటన చేస్తూ రాత్రి సమయంలో రెక్కీ వేసిన ఇళ్లలో చొరబడి దోపిడీకి పాల్పడేవారు. అప్పట్లో దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా హడావుడి జరిగింది. ఢిల్లీ పోలీసులు 1990ల్లోనే ఈ గ్యాంగ్‌పై దర్యాప్తు చేపట్టారు. మాజీ పోలీస్ కమిషనర్ నీరజ్ కుమార్ ఈ గ్యాంగ్‌పై ఒక పుస్తకమే రాశారు.
Read Also:Bandla Ganesh: పవన్ కళ్యాణ్ కొన్ని వందల కాల్ షీట్లు వేస్ట్ చేశారు.. నిర్మాతకు బండ్ల కౌంటర్
గ్యాంగ్ ఎలా పని చేస్తుంది?
తొలుత బిచ్చగాళ్లు, కార్మికుల రూపంలో ఉన్నట్లు నటిస్తూ లక్ష్యంగా పెట్టుకున్న ఇళ్లను గుర్తిస్తారు. అర్ధరాత్రి సమయంలో సభ్యులు సమూహంగా ఒక ఇంటిని టార్గెట్ చేసి చొరబడతారు. వీరు చావుకు కూడా భయపడకుండా ఎదురొచ్చిన వారిని హతమార్చడానికి వెనుకాడరు. చిన్న చిన్న విషయాలకు హింసను ఆశ్రయిస్తారు. తాళాలు పగులగొట్టేందుకు ప్రత్యేకమైన ఆయుధాలను ఉపయోగిస్తారు.
“కచ్చా-బనియన్” గ్యాంగ్ ఎక్కడ కనిపించింది?
జూలై 2023లో జైపూర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో దొంగతనం జరిగినప్పుడు సీసీటీవీ ఫుటేజ్‌లో ఈ గ్యాంగ్ సభ్యులు కనిపించారు. అదే సంవత్సరం యూపీలో గాజీపూర్ పోలీస్ 13 మంది కచ్చా-బనియన్ గ్యాంగ్ సభ్యులను అరెస్ట్ చేసింది. 2023లో బీహార్ రాష్ట్రం మోతిహారి ప్రాంతంలో దొంగతనాలతో పాటు హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. గతేడాది జనవరిలో మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఒక గ్యాంగ్ సభ్యుడిని పోలీసులు అరెస్టు చేశారు.
Read Also:America : ప్రపంచంలోనే అత్యంత విచిత్రమైన చోరీ.. అమెరికాలో లక్ష గుడ్లు మాయం
భారతదేశంలో గ్యాంగ్ ప్రభావిత రాష్ట్రాలు
ఈ గ్యాంగ్ ప్రధానంగా గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల్లో యాక్టివ్‌గా ఉంది. కుంభమేళాలో భారీగా భక్తులు హాజరవుతుండటంతో కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయి. అయితే, పోలీసుల అనుమానం ప్రకారం.. కచ్చా-బనియన్ గ్యాంగ్ ఇలాంటి పరిస్థితులను ఆసరాగా తీసుకుని దొంగతనాలు, విధ్వంసాలు సృష్టించే ఉంటాయని భావిస్తున్నారు. దీనిపై అధికారికంగా ఇంకా నిర్ధారణ కాలేదు.