Madras High Court: పోక్సో చట్టం కింద నిందితుడు మైనర్ బాలికతో లైంగిక నేరానికి పాల్పడితే ‘‘వివాహం’’ ఎలాంటి రక్షణ ఇవ్వదని మద్రాస్ హైకోర్టు పేర్కొంది. 22 ఏళ్ల వ్యక్తి 17 ఏళ్ల బాలికతో లైంగిక సంబంధం పెట్టుకున్న కేసును విచారించిన కోర్టు, అతడికి 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. కోర్టులో విచారణ సమయంలోనే బాలిక అతడికి భార్యగా మారింది.
మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన తమిళనాడు అటవీ శాఖ మంత్రి కె.పొన్ముడిపై చర్యలు తీసుకోవాలని మద్రాస్ హైకోర్టు సూచించింది. వెంటనే మంత్రిపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. లేనిపక్షంలో కోర్టు ధిక్కార చర్యగా పరిగణిస్తామని హెచ్చరించింది. జస్టిస్ ఎన్.ఆనంద్ వెంకటేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కేసును ఏప్రిల్ 23కి వాయిదా వేశారు.
తమిళనాడు రాజధాని చెన్నైలో సీబీఐ మెరుపు దాడులు చేస్తోంది. పలుచోట్ల ఒకేసారి సీబీఐ అధికారులు తనిఖీలు చేపట్టారు. దీంతో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది. రూ.5,832 కోట్ల విలువైన బీచ్ ఇసుక తవ్వకాల కుంభకోణం కేసులో ప్రముఖ వ్యాపారవేత్త ఇంట్లో సహా తమిళనాడు వ్యాప్తంగా 18 చోట్ల సీబీఐ దాడులు చేపట్టింది.
స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే కేసులో తనకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని కునాల్ కమ్రా పిటిషన్ వేశారు.
Madras High Court: భార్యలు పోర్న్ చూడటం విడాకులకు కారణం కాదని, వివాహం చేసుకున్న తర్వాత మహిళలు హస్త ప్రయోగం చేసుకునే హక్కును కలిగి ఉంటారని, వారి లైంగిక స్వయంప్రతిపత్తిని వదులుకోరని మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. తమిళనాడులో ఒక వ్యక్తి దిగువ కోర్టు విడాకులకు నిరాకరించడంతో, హైకోర్టును ఆశ్రయించిన తరుణంలో బుధవారం న్యాయమూర్తులు ఈ వ్యాఖ్యలు చేశారు.
Anna University Case: చెన్నై అన్నా యూనివర్సిటీలో 19 ఏళ్ల విద్యార్థినిపై లైంగిక దాడి ఘటన తమిళనాడులో పొలిటికల్ టర్న్ తీసుకుంది. అధికార డీఎంకే పార్టీ కార్యకర్త నిందితుల్లో ఒకరని బీజేపీ ఆరోపిస్తోంది. ఇందుకు సాక్ష్యాంగా స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్‌తో ఉన్న నిందితుడి ఫోటోలను షేర్ చేసింది. ఇదిలా ఉంటే అన్నా యూనివర్సిటీ లైంగిక వేధింపుల కేసును మద్రాస్ హైకోర్టు సుమోటోగా తీసుకుంది.
భర్త మరణానంతరం మరో వివాహం చేసుకున్న భార్యకు హిందూ వివాహ చట్టం ప్రకారం భర్త ఆస్తిలో వాటా పొందేందుకు హక్కు ఉంటుందని మద్రాసు హైకోర్టు తీర్పు ఇచ్చింది. తమిళనాడులోని సేలంకు చెందిన చిన్నయ్యన్ అనే వ్యక్తి మృతి చెందాక ఆయన భార్య మల్లిక రెండో పెళ్లి చేసుకున్నారు.
Madras High Court: టీనేజ్ ప్రేమని నేరంగా పరిగణించలేమని పేర్కొంటూ లైంగిక వేధింపులకు పాల్పడిన కేసును ఎదుర్కొంటున్న యువకుడిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ని రద్దు చేస్తూ మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ తీర్పు చెప్పింది. జస్టిన్ ఎన్ ఆనంద్ వెంకటేష్‌తో కూడిన ధర్మాసనం నవంబర్ 4 నాటి ఉత్తర్వుల్లో.. యువకుడు, యువతి మధ్య శారీరక సంబంధం ఇద్దరి మధ్య ఏకాభిప్రాయ సంబంధంలో సహజమైన పరస్పర చర్య అని తీర్పు చెప్పింది. ఐపీసీ సెక్షన్ 354-A(1)(i) ప్రకారం ఇది నేరానికి…
ట్రిపుల్ తలాక్ కేసులో మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. షరియత్ కౌన్సిల్ ప్రైవేట్ సంస్థ అని, కోర్టు కాదని న్యాయమూర్తి అన్నారు. ప్రస్తుతం విచారించిన కేసు 2010లో వివాహం చేసుకున్న ముస్లిం డాక్టర్ దంపతులది. భర్త ట్రిపుల్ తలాక్ ఇచ్చి మళ్లీ పెళ్లి చేసుకున్నాడని.. అయితే మూడో తలాక్ పై భర్త ఎప్పుడూ ప్రస్తావించలేదని భార్య ఆరోపించింది.