K Annamalai: తిరుప్పరకుండ్రం సుబ్రమణ్య స్వామి ఆలయంలో దీపం వెలిగింపు వివాదంగా మారింది. ఇటీవల మద్రాస్ హైకోర్ట్ న్యాయమూర్తి జిఆర్ స్వామినాథన్, కొండపై ఉన్న స్తంభంపై దీపం వెలిగించాలని తీర్పు చెప్పారు. అయితే, ఈ తీర్పును ప్రభుత్వం పాటించలేదు. ఎన్నో ఏళ్లుగా వస్తున్న కొండ కింద ఉన్న స్తంభంపై దీపం వెలిగించారు. హైకోర్టు ఆర్డర్స్ ఉన్నప్పటికీ, భక్తుల్ని కొండపై దీపం వెలిగించేందుకు డీఎంకే ప్రభుత్వం అనుమతించకపోవడం ఉద్రిక్తతలకు కారణమైంది. అయితే, ఈ కొండపై 6వ శతాబ్ధం నాటి కార్తికేయుడి ఆలయంతో పాటు 14వ శతాబ్ధం నాటి దర్గా ఉంది. దీంతో మతపరమైన ఉద్రిక్తతలు పెరుగుతాయని డీఎంకే వాదిస్తోంది.
Read Also: Rahul Gandhi: గాంధీ హత్య తర్వాత, “ఆర్ఎస్ఎస్” అన్ని సంస్థల్ని ఆక్రమించుకుంటోంది..
ఇదిలా ఉంటే, తీర్పు చెప్పిన న్యాయమూర్తి జిఆర్ స్వామినాథన్‌ను తొలగించాలని మంగళవారం డీఎంకే, కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, ఇతర ఇండియా కూటమికి చెందిన 120 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ ఓంబిర్లాకు ‘‘అభిశంసన’’ తీర్మానాన్ని అందించారు. ఈ చర్యపై తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి పార్టీలు వారి ‘‘హిందూ వ్యతిరేకతను’’ ప్రదర్శిస్తున్నాయని ఆరోపించారు. భారత సుప్రీంకోర్టు ముందు అప్పీల్ పెండింగ్‌లో ఉన్నప్పటికీ అభిశంసన తీర్మాణం ముస్లింల బుజ్జగింపు రాజకీయాల కోసమే అని ఆయన అన్నారు. ఈ చర్య రాజకీయ ఒత్తిడి ద్వారా తీర్పును సవాల్ చేయవచ్చనే సందేశాన్ని పంపిస్తోందని, ఇది రాజ్యాంగ విలువలకు ముప్పు కలిగిస్తుందని అన్నామలై ఆరోపించారు.
ఇది న్యాయమూర్తిని బెదిరించడమే అని బీజేపీ అధికార ప్రతినిధి నారాయణ్ తిరుపతి ఆరోపించారు. న్యాయమూర్తి బ్రహ్మణ వర్గానికి చెందిన వాడు కాబట్టి ఆయనను బెదిరించాలని వారు కోరుకుంటున్నారని, డీఎంకే అందుకే ఇలా చేస్తో్ందని, డీఎంకే బ్రహ్మణ వ్యతిరేక, హిందూ వ్యతిరేకతకు ప్రసిద్ధి చెందిందని, అందుకే వారు ఇలా చేస్తున్నారని అన్నారు. ఇదిలా ఉంటే, మద్రాస్ హైకోర్టు తీర్పు నేపథ్యంలో, అరుళ్మిఘు సుబ్రమణ్య స్వామి ఆలయంలోని భక్తులు ‘దీపథూన్’ వద్ద సాంప్రదాయ ‘కార్తీగై దీపం’ వెలిగించడానికి అనుమతిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది.