Tamil Nadu: గత నెలలో కస్టడీలో అజిత్ కుమార్ అనే 27 ఏళ్ల వ్యక్తి కస్టడీలోనే మరణించడం సంచలనంగా మారింది. తమిళనాడులో జరిగిన ఈ సంఘటనపై అక్కడి డీఎంకే ప్రభుత్వం, పోలీసులపై ఆగ్రహానికి కారణమైంది. దొంగతనం కేసులో ఆలయ సెక్యూరిటీ గార్డు అజిత్ కుమార్‌ని కస్టడీలో పోలీసులు దారుణంగా కొట్టడం, చిత్రహింసలు పెట్టడంతో మరణించారు. ఈ కేసులో మద్రాస్ హైకోర్టు ప్రభుత్వం, పోలీసులు తీరును తీవ్రంగా విమర్శించింది. ఇదిలా ఉంటే, కస్టడీలో మరణించిన అజిత్ కుమార్ కుటుంబానికి రూ. 25 లక్షల మధ్యంతర పరిహారం చెల్లించాలని మద్రాస్ హైకోర్టు మంగళవారం తమిళనాడు ప్రభుత్వాన్ని చెల్లించింది.
శివగంగ జిల్లాలోని మాదపురం ఆలయంలో అజిత్ కుమార్ సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవాడు. గత నెలలో, దొంగతనం కేసుకు సంబంధించి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఒక భక్తురాలు అజిత్‌ను తన కారు పార్క్ చేయమని కోరిందని, కానీ అతడికి ఎలా డ్రైవ్ చేయాలో తెలియకపోవడంతో, దానిని పార్క్ చేయాలని మరొక వ్యక్తిని కోరాడు. దీని తర్వాత, భక్తురాలు తన కారు నుంచి డబ్బు, నగలు పోయినట్లు ఆరోపించింది. పోలీసులు అజిత్‌ని ప్రశ్నించేందుకు తీసుకెళ్లారు.
Read Also: Boeing Jets: ‘‘ఇంధన నియంత్రన స్విచ్‌లో లోపాలు లేవు’’.. ఎయిర్ ఇండియా ప్రకటన..
రోజుల తర్వాత, అనుమానాస్పద స్థితిలో పోలీస్ కస్టడీలో మరణించాడు. పోస్టుమార్టం నివేదికలో అతడి శరీరంపై 40కి పైగా గాయాలు బయటపడ్డాయి. కస్టడీలో చిత్రహింసలకు గురైనట్లు ఆధారాలు లభించాయి. నాగరిక సమాజంలో ఇటువంటి చర్యలను సహించలేమని, కఠినంగా వ్యవహరించాలని కోర్టు పేర్కొంది. తమిళనాడు ప్రభుత్వం గతంలో అజిత్ సోదరుడికి రూ.7.5 లక్షలు పరిహారం, ఇంటి స్థలం మరియు ప్రభుత్వ ఉద్యోగం అందించాలని ప్రతిపాదించింది.
ఈ కేసును తమిళనాడు ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. సీఎం స్టాలిన్ అజిత్ కుమార్ కుటుంబానికి బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. శివగంగై పోలీసు సిబ్బందిపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేుసింది. కోర్టు ఆదేశాల మేరకు నికిథా అనే మహిళ దాఖలు చేసిన అసలు దొంగతనం ఫిర్యాదును కూడా దర్యాప్తు చేస్తోంది. ఇప్పటి వరకు, ఈ కేసులో ఒక డీఎస్పీని సస్పెండ్ చేశారు. ఎస్పీని వెయింటింగ్‌లో ఉంచారు. ఆగస్టు 20 నాటికి తుది నివేదిక సమర్పించాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది.