విశాల్ తన సొంత నిర్మాణ సంస్థ కోసం సినీ ఫైనాన్షియర్ అన్బుచెజియన్ కు చెందిన గోపురం ఫిల్మ్స్ వద్ద 21 కోట్ల 29 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడు. అయితే ఈ మొత్తాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ చెల్లించింది. అయితే ఈ మొత్తాన్ని విశాల్ తిరిగి చెల్లించేవరకు అతని అన్నిసినిమా హక్కులను లైకాకు ఇవ్వాలనే ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుంది. అయితే ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించి వీరమే వాగై చూడం సినిమాను విడుదల చేసినందుకు విశాల్‌పై…
Madras High Court: డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ ‘సనాతన ధర్మం’పై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వివాదాన్ని రేకెత్తించాయి. ఇదిలా ఉంటే సనాతన ధర్మంపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘సనాతన ధర్మం అనేది దేశం, తల్లిదండ్రులు, గురువుల పట్ల శాశ్వతమైన కర్తవ్యాల సమాహారమని అలాంటి విధులను ఎందుకు నాశనం చేయాలని ఆలోచించారు’’ అంటూ వ్యాఖ్యానించింది.
Madras High Court Reopens corruption Case against former CM Panneerselvam: తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వంకు షాక్ తగిలింది. 11 ఏళ్ల తర్వాత అక్రమ సంపాదన కేసు పునర్విచారణను సుమోటోగా స్వీకరించింది మద్రాస్ హైకోర్టు. వివరాల ప్రకారం.. 2001-06 మధ్య కాలంలో దివంగత జయలలిత ప్రభుత్వంలో పన్నీర్ సెల్వం రెవెన్యూ శాఖ మంత్రిగా పని చేశారు. అయితే ఆ సమయంలో ఆయన ఆదాయానికి మించి సంపాదించారని ఆరోపణలు వచ్చాయి. రూ. 1.77 కోట్ల…
తల్లి సంక్షరణ గురించి విస్మరించిన కూతురికి ఆమె ఆస్తిపై హక్కులు ఉండవని మద్రాస్ హైకోర్టు తీర్పునిచ్చింది. తల్లి ఆలనాపాలనా చూసుకోని ఓ కూతురు.. ఆస్తి రిజిస్ట్రేషన్ హక్కులను రద్దు చేస్తూ ఓ రెవెన్యూ అధికారి ఇచ్చిన ఉత్తర్వులను న్యాయస్థానం సమర్థించింది.
Madras High Court: లైంగిక పటుత్వ పరీక్ష(పొటెన్సీ టెస్ట్)కు అనుసరిస్తున్న విధానాల్లో మార్పు తీసుకురావాలని మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సైన్స్ అభివృద్ధి చెందిందని, వీర్య నమూనాలు సేకరించాల్సిన అవసరం లేదని, కేవలం నిందితుడి రక్తనమూనాలను ఉపయోగించి పొటెన్సీ టెస్ట్ నిర్వహించేందుకు ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని రూపొందించాలని అధికారులకు మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Two Finger Test: ఓ కేసు విచారణ సందర్భంగా మద్రాసు హైకోర్టు సోమవారం సంచలన వ్యాఖ్యలు చేసింది. నిందితుల మగతనాన్ని పరీక్షించేందుకు కొత్త సైంటిఫిక్ టెక్నిక్స్‌ని ఉపయోగించాలని, వీలైనన్ని త్వరగా ఈ SOP సిద్ధం చేయాలని, తద్వారా వీర్యం పరీక్ష ప్రక్రియను నిలిపివేయాలని కోర్టు చెబుతోంది.
తమిళనాడు రాజకీయల్లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. అన్నాడీఎంకే ఎంపీ ఓపీ రవీంద్రనాథ్‌కు మద్రాసు హైకోర్ట్ షాక్ ఇచ్చింది. తేనీ నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఆయన ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పును వెల్లడించింది. దీంతో ఆయన ఎన్నికను హైకోర్టు క్యాన్సిల్ చేసింది. పన్నీరు సెల్వం కుమారుడు రవీంద్రనాథ్‌కు ఎదురుదెబ్బ తగలినట్లైంది.
తమిళనాడులోని ప్రతిపక్ష పార్టీ అయిన ఎఐఎడిఎంకె చీఫ్ గా మాజీ సీఎం ఎడప్పాడి కె పళనిస్వామిని ఎన్నికైయ్యారు. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిపై గత కొంత కాలంగా మాజీ సీఎంలు ఈపీఎస్- ఓపీఎస్ ల మధ్య వివాదం నడుస్తోంది.