దక్షిణాఫ్రికా నుండి 12 చిరుతలతో కూడిన రెండో బ్యాచ్ ఫిబ్రవరి 18న మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌కి చేరుకుంటుందని సీనియర్ అటవీ అధికారి శనివారం తెలిపారు.
మధ్యప్రదేశ్‌లో నేషనల్ హెల్త్ మిషన్ కింద కాంట్రాక్ట్ నర్సుల నియామకం కోసం నిర్వహిస్తోన్న పరీక్షలో ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు గుర్తించడంతో రద్దు చేయబడింది.
Love Failure Incident: ఇటీవల ప్రేమ వ్యవహారాలు హత్యలు, ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి. ప్రేమ పేరుతో మోసపోయిన యువతీ యువకులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి, వాడుకుని మోసం చేసి వేరే వారిని వివాహం చేసుకుంటున్న సంఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. ఇదిలా ఉంటే ప్రేమ పేరుతో మోసపోయిన ఓ యువతి మత్తు మందును ఇంజెక్షన్ చేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇండోర్ నగరంలో చోటు చేసుకుంది.
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలో దారుణం చోటుచేసుకున్నది. ఓ వృద్ధురాలిని ముగ్గురు వ్యక్తులు తాళ్లతో కట్టేసి కొట్టారు. ఆమెను కులం పేరుతో దూషించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వృద్ధురాలిని కొట్టిన ఘటనపై ఖర్గోన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఓ వృద్ధురాలిని చేతులు కట్టేసి ముగ్గురు వ్యక్తులు ఆమెపై విచక్షణా రహితంగా దాడికిపాల్పడ్డారు. హీరాపూర్‌కు చెందిన గిరిజన మహిళకు ఓ కుమారుడు ఉన్నాడు. అతడు పొట్టకూటికోసం…
MP govt renames Bhopal's Islam Nagar village as Jagdishpur: ఇటీవల కాలంలో పలు ప్రాంతాల పేర్లను మార్చి కొత్త పేర్లను పెట్టడం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పలు పట్టణాల పేర్లను మార్చివేడయం చూశాం. యోగీ సర్కార్ ఉత్తర ప్రదేశ్ లో కొలువుదీరిన తర్వాత అలహాబాద్ ను ప్రయాగ్ రాజ్ గా, ఫైజాబాద్ జిల్లాను అయోధ్య జిల్లాగా, ముస్తాఫాబాద్ ను రాంపూర్ గా, ఫిరోజాబాద్ ను చంద్రానగర్ గా, మొగల్ సరాయ్…
Huge Fire : మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో ఎగ్జిబిషన్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గ్వాలియర్ ఫెయిర్ పేరుతో జరుగుతున్న వ్యాపార మేళాలో వరుసగా ఉన్న పదుల సంఖ్యలోని దుకాణాలన్నీ అగ్నికి ఆహుతయ్యాయి.
మధ్యప్రదేశ్‌లోని పన్నాలో శనివారం ఓ ప్రముఖ వస్త్ర వ్యాపారి తన భార్యను హత్య చేసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంఘటనా స్థలం నుంచి పోలీసులు సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకోవడంతో ఈ వార్త నగరం మొత్తం కలకలం రేపింది.
శ్రీరామ చంద్రమీసన్ ఆదిగురువు లాలాజీ మహరాజ్ 150వ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ శంషాబాద్ సమీపంలోని కన్హశాంతి వనంలో ఘనంగా నిర్వహించారు. ఈజయంతి వేడుకల్లో సంగీత ఉత్సవం నిర్వహిస్తారు.
Madhya Pradesh: మధ్యప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని నమోదు చేసింది. అసెంబ్లీ ఎన్నికలు వస్తున్న తరుణంలో బీజేపీకి ఈ విజయం దక్కడంపై ఆ పార్టీ సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 5 జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న 19 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగాయి. దీంతో 11 మున్సిపాలిటీల్లో బీజేపీ విజయం సాధించగా.. 8 పట్టణాల్లో కాంగ్రెస్ మెజారిటీ సాధించింది. బీజేపీ అభ్యర్థులు 183 కౌన్సిలర్ స్థానాలను కైవసం చేసుకోగా.. 143 వార్డుల్లో…