Smart Cities Awards: ఇండియాలో అదే స్మార్ట్ సిటీ.. ఎందుకో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Smart Cities Awards: దేశంలో ఉత్తమ స్మార్ట్ సిటీలను కేంద్ర ప్రకటించింది. ఆయా నగరాల్లో జరుగుతున్న అభివృద్ధితోపాటు.. నగరంలో ఉన్న సౌకర్యాలు ఇతర పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని స్మార్ట్ సిటీల ఎంపికను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. అందులో మధ్యప్రదేశ్‌కు చెందిన ఇండర్ నగరం అత్యంత స్మార్ట్ సిటీగా నిలిచింది. అత్యుత్తమ రాష్ట్రంలో మధ్యప్రదేశ్ నిలిచింది. కేంద్ర ప్రభుత్వం 2022 సంవత్సరానికి గానూ ఇండియా స్మార్ట్ సిటీస్ అవార్డులను శుక్రవారం ప్రకటించింది. మధ్యప్రదేశ్ ఉత్తమ ‘స్టేట్ అవార్డు’ గెలుచుకోగా, తమిళనాడు రెండో స్థానంలో నిలిచింది. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాయి. మధ్య ప్రదేశ్‌లోని ఇండోర్ నగరం దేశంలోనే అత్యుత్తమ స్మార్ట్ సిటీగా ఎంపిక కాగా.. ఆ రాష్ట్రం ఉత్తమ రాష్ట్రంగా ఎంపికయ్యాయి. అత్యుత్తమ నగరాల్లో రెండో స్థానంలో సూరత్ ఉండగా.. మూడో స్థానంలో ఆగ్రా నిలిచాయి. ఇక అత్యుత్తమ రాష్ట్రాల్లో రెండో స్థానంలో తమిళనాడు, మూడో స్థానంలో రాజస్థాన్ నిలిచాయి. వివిధ ప్రాజెక్టుల ఫలితాలు, ప్రాజెక్టుల ప్రగతి, బహుమతుల కోసం ప్రజంటేషన్ ఇచ్చిన తీరు వంటివాటి ఆధారంగా నగరాలు, రాష్ట్రాల్లో ఉత్తమమైనవాటిని కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎంపిక చేసింది. ఈ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) సెప్టెంబరు 27న ఇండోర్‌లో జరిగే కార్యక్రమంలో ప్రదానం చేయనున్నారు.
Read Also: Pawan Kalyan: కౌంట్‌డౌన్ స్టార్ట్… ట్రిపుల్ ధమాకా లోడింగ్!
Also Read
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
- UPI Charges: మళ్లీ క్యాష్ ఎకానమీ వైపు భారత్? రిటైలర్ల ఆందోళన
- Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ వివిధ కేటగిరీల్లో 66 పురస్కారాలను ప్రకటించింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పురి సామాజిక మాధ్య ట్వీట్టర్ ఎక్స్ లో ఇచ్చిన ట్వీట్‌లో, ఇండియా స్మార్ట్ సిటీస్ మిషన్ అవార్డ్స్, 2022లో ఉత్తమ రాష్ట్రం అవార్డు పొందిన మధ్య ప్రదేశ్‌ను అభినందించారు. ఈ రాష్ట్రంలోని ఏడు నగరాల్లో రూ.15,696 కోట్ల విలువైన బహుళ రంగ ప్రాజెక్టులు 779 పురోగతిలో ఉన్నాయని తెలిపారు. స్వచ్ఛ భారత్ పథకంలో గత 6 సంవత్సరాల నుంచి ఇండోర్ నగరం దేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరంగా పురస్కారాలను పొందుతున్నదని గుర్తు చేశారు. స్వచ్ఛ్ సర్వేక్షణ్ లో 2022లో మధ్య ప్రదేశ్ అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రంగా నిలిచింది. స్మార్ట్ సిటీస్ అవార్డ్స్ 2021లో ఇండోర్, సూరత్ ప్రథమ స్థానాన్ని పంచుకున్నాయి. స్మార్ట్ సిటీస్ అవార్డ్స్, 2022లో బిల్ట్ ఎన్విరాన్‌మెంట్ కేటగిరీలో కోయంబత్తూరుకు ప్రథమ స్థానం లభించించగా.. మోడల్ రోడ్ల నిర్మాణం, సరస్సులు, చెరువుల పునరుద్ధరణలో ప్రగతి బాటలో పయనిస్తున్నందుకు ఈ పురస్కారం లభించింది. స్మార్ట్ సిటీస్ అవార్డ్స్ 2022లో ఎకనమిక్ కేటగిరీలో జైపూర్ ఇంక్యుబేషన్ సెంటర్ ప్రథమ స్థానంలో నిలిచింది. మొబిలిటీ, గవర్నెన్స్ విభాగాల్లో చండీగఢ్‌లోని పబ్లిక్ బైక్ షేరింగ్, ఈ-గవర్నమెంట్ సర్వీసెస్ ప్రధమ స్థానంలో నిలిచాయి. కేంద్ర పాలిత ప్రాంతాల విభాగంలో చండీగఢ్‌కు ప్రథమ స్థానంలో నిలిచింది.
తాజావార్తలు
-
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!