Madhya Pradesh: మధ్యప్రదేశ్ ఛతర్‌పూర్ లో దారుణం జరిగింది. రక్షాబంధన్ పండగ రోజునే అన్నాచెల్లెలుపై దాడి జరిగింది. ప్రేమికులని భావించి ముగ్గురు వ్యక్తులు వీరిని చితకబాదారు. ఈ ఘటనపై బాధితులు ఫిర్యాదు చేయడంతో నిందితులపై ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆగస్ట్ 31న జరిగిన ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.
Read Also: New Parliament: ఈ నెల 19 నుంచి కొత్త పార్లమెంట్‌లో సమావేశాలు..?
కొంతమంది నిందితుడు హిందూసంస్థ భజరంగ్ దళ్ కి చెందిన వ్యక్తిగా ఆరోపించారు. అయితే పోలీసులు మాత్రం దీనికి ఖచ్చితమైన ఆధారాలు లేవని పేర్కొన్నారు. ఈ ఆరోపనల్ని జిల్లా ఎస్పీ రత్నేష్ తోమర్ ఖండించారు. అతుల్ చౌదరి అనే వ్యక్తి తన సోదరితో కలిసి ఫిర్యాదులో భజరంగ్ దళ్ ప్రమేయం లేదని పేర్కొన్నారు. బాధితులు అతుల్ చౌదరి, అతని సోదరి సతాయ్ రోడ్డులో ఉన్న దేవాలయం సమీపంలో చాట్ దుకాణం వద్ద నిలబడి ఉన్నారు. లవర్స్ గా భావించి ముగ్గురు అక్కడే వీరిపై దాడి చేశారు. ఈ దాడికి ఏ రాజకీయ పార్టీకి కానీ ఏ సంస్థకి కానీ సంబంధం లేదని పోలీసులు తెలిపారు. ఘటనపై తదుపరి విచారణ సాగుతోంది.